సిద్దిపేట నవంబర్‌ 9: గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన నామినేషన్‌ పత్రాలను ఆర్‌వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. ఎర్రవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గజ్వేల్‌కు వెళ్లారు కేసీఆర్‌. నామినేషన్‌ దాఖలు అనంతరం గజ్వేల్‌ నుంచి హెలికాప్టర్‌లో కామారెడ్డికి కేసీఆర్‌ బయల్దేరారు కేసీఆర్‌. అక్కడ మధ్యాహ్నం 2 గంటల లోపు కేసీఆర్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. కేసీఆర్‌ ప్రసంగంపై జనాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో సీఎం కేసీఆర్‌ శనివారం ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్‌ వేసే ముందు ప్రతిసారి సీఎం కేసీఆర్‌ కోనాయిపల్లి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఆలయంలో తొలుత ధ్వజస్తంభానికి మొక్కి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు నామినేషన్‌ పత్రాలను స్వామి వారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూజలు నిర్వహించి నామినేషన్‌ పత్రాలను అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌, కామారెడ్డి శాసనసభకు వేసే(రెండు సెట్లు) నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *