తిరుపతి: ప్రాచీన కట్టడాలను, పురాతన సంపదను మనం కాపాడుకోవాలి. తిరుమల కొండపై ప్రాచీన కట్టడాలు అనేకం ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఎంతో మంది రాజులు తిరుమల కొండపై అనే కట్టడాలు నిర్మించారు. అలాంటిదే విజయనగరం సామ్రాధీశులు నిర్మించిన మండపమే పార్వేట మండపం. అది దాదాపు 500 సంవత్సరాల కాలం నాటి అతి పురాతన కట్టడం. దానిని జీర్ణోద్ధరణ పేరుతో తొలగించారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం అయన విూడియాతో మాట్లాడారు. పార్వేట మండపాన్ని ఎవరి అనుమతితో తొలగించారు. ఒక వేళ పాలకమండలిలో నిర్ణయం తీసుకొని ఉంటే ఏ తేదీలో నిర్ణయం తీసుకొన్నారో టిటిడి ఇఓ సమాధానం చెప్పాలి. సెక్షన్ 30 ఆప్ ప్రిన్సిపాల్ యాక్ట్ ప్రకారం ప్రాచీన కట్టడాలు తొలగిస్తే మూడు సంవత్సరాల పాటు శిక్ష పడుతుంది. ఆర్కియాలజీ వారు గతంలో 2011 సంవత్సరం 1000 కాళ్ళ మండపం తొలగింపు పై కూడా నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ఆర్కియాలజీ అనుమతి లేకుండా ఎలాంటి పురాతన కట్టడాలను తోలగించరాదని తెలిపారు.
టిటిడి తెలిపిన విధంగా 1958 సెక్షన్ 6 /253 క్రింద ఎలాంటి అనుమతులు అవసరం లేదని తెలుపుతున్నారు. కానీ ఆ సెక్షన్ సారాంశం ప్రకారం అది 100 సంవత్సరాలలోపు ఉన్న కట్టడానికి మాత్రమే వర్తిస్తుంది. టిటిడి ఇఓ కి నేను సవాల్ విసురుతున్నానని అన్నారు.