వీరబల్లి: మూమెంట్ ఇండియా వారి ఆధ్వర్యంలో గ్రామ జ్యోతి సొసైటీ వారి ఆదేశాల మేరకు మదనపల్లి వెలుగు సొసైటీ లో వాక్ ఫర్ ఫ్రీడమ్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధిగా జడ్జి అబ్రహం పాల్గొని ఎన్జిఓ ప్రతినిధులను సన్మానించారు.మానవ అక్రమ రవాణా అరికట్టడంపై విఆర్డీఎస్ ఆధ్వర్యంలో చాలా అవగాహన కార్యక్రమాలు చేపట్టినందుకు ,మా సేవలను గుర్తించి మూమెంట్ ఇండియా ప్రతినిధులు నిస్సి అనుగ్రహ, ఫెలిషియా ,జడ్జి అబ్రహం ,గ్రామ జ్యోతి సొసైటీ సుభద్ర చేతుల మీదుగా శాలువా ,మెమెంటోతో సన్మానించడం చాలా గర్వంగా ఉందని విఆర్డీఎస్ సురేంద్రరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో వెలుగు సొసైటీ కన్వీనర్ భాగ్య లక్ష్మీ, గుడ్ నైబర్స్ నగేష్, మీ కోసం విష్ణు,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *