హైదరాబాద్ : ఈనెలాఖరున జరిగే శాసనసభ ఎన్నికలలో పోటీ చేయమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల వెల్లడిరచారు. శుక్రవారం ఆమె విూడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ఓడిరచడం మా ఉద్దేశ్యం కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వవద్దు అని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. కాంగ్రెస్ నాయకులన్నా, కార్యకర్తలన్నా తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. ఇటీవల ఢల్లీిలో తాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసినప్పుడు… తనను కుటుంబ సభ్యురాలిగా వారు చూశారని తెలిపారు. మేము పోటీ చేస్తే కేసిఆర్ కి లాభం జరుగుతుందని మేధావులు చెప్పారు అందుకే తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయం ఇది. కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. తమ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులందరూ అర్థం చేసుకోవాలని కోరారు.
షర్మిల నిర్ణయంతో లోటస్ పాండ్ లో కొద్దిసేపు గందరగోళం ఏర్పాడిరది. తమ మనోభావాలను షర్మిల పట్టించుకోలేదని పార్టీ కార్యకర్తలు, నాయకులు వాపోయారు. పార్టీ కోసం గత కొంతకాలంగా పనిచేసినా, కనీసం ఆఖరి క్షణం లో పిలిచినా పట్టించుకోలదేని అన్నారు. రెండు వర్గాలకు చీలిన నాయకులు కు కార్యకర్తలు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చిన్నపాటి తోపులాట చోటు చేసుకుంది. ఒక్కసారిగా పార్టీ కార్యాలయం లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.
