ఏలూరు అక్టోబర్ 28: బీసీలపై వైసీపీ ప్రభుత్వానిది కపట ప్రేమ అని మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. శనివారం నాడు ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ…‘‘ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్‌లో పది శాతం కోత విధించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల ఓట్ల కోసం జగన్‌రెడ్డి మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారు. గత ప్రభుత్వం బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం 35 పథకాలను ప్రవేశపెడితే వాటిని రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది. వైసీపీ పాలనలో జగన్ సామాజిక వర్గానికే పదవుల్లో పెద్దపీట వేశారు’’ అని ఎంఏ షరీఫ్ మండిపడ్డారు.