సిద్దిపేట:దుబ్బాకలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. దుబ్బాక`దుంపలపల్లి మధ్య సీపీఐ మావోయిస్టు పార్టీ పేరుతో పిల్లర్ కు వాల్ పోస్టర్లు గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ ఎస్ నాయకులని హెచ్చరిస్తూ వాల్ పోస్టర్లు కనిపించాయి. బి ఆర్ ఎస్ నాయకులు, ఇసుక మాఫీయా, భూ కబ్జా లు చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేసి హత్యలు చేస్తున్నారు. ప్రజల పై బి ఆర్ ఎస్ నాయకులు పెత్తనం చేలాయిస్తున్నారు. బి ఆర్ ఎస్. నాయకులు ఇక నుండి ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజల ముందు శిక్షలు తప్పవని మావోయిస్టులు హెచ్చరించారు