న్యూఢల్లీి, అక్టోబరు 27: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న వైయస్సార్‌ తెలంగాణ పార్టీ కి కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తును కేటాయించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బైనాక్యులర్‌ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా తమకు ఉమ్మడి గుర్తు కేటాయించాలని వైయస్సార్టీపీ ఈసీని ఇటీవల కోరింది. ఈ క్రమంలో రిజిస్టర్డ్‌ పార్టీగా ఉన్న వైయస్సార్‌ తెలంగాణ పార్టీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం పేరా 10బీ కింద అనుమతిస్తూ ఈ పార్టీకి ఉమ్మడి గుర్తును కేటాయించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైయస్సార్టీపీ అభ్యర్థులకు బైనాక్యులర్‌ గుర్తును ఉమ్మడిగా కేటాయించింది. 50 మంది సొంత బందీల్ని చంపుకున్న ఇజ్రాయెల్‌ ? హమాస్‌ సంచలన ప్రకటన..! నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఆ పార్టీ అభ్యర్థులకు బైనాక్యులర్‌ గుర్తును కేటాయించాలని ఎన్నికల సంఘం.. రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించింది. అయితే, ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేని నియోజకవర్గాల్లో మాత్రం ఇతర అభ్యర్థులు ఎంచుకునేలా ఫ్రీ సింబల్స్‌ జాబితాలో బైనాక్యులర్‌ గుర్తు అందుబాటులో ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ఒకవేళ పార్టీ కనీసం 5 శాతం స్థానాల్లో అభ్యర్థులను నిలపకపోతే మాత్రం ఉమ్మడి గుర్తు అందుబాటులో ఉండదని ఈసీ పేర్కొంది. రాష్ట్రానికి సంబంధించి మరి కొన్ని రిజిస్టర్డ్‌ పార్టీలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్ముడి గుర్తు కేటాయించింది. ఆజాద్‌ పార్టీకి సీసీటీవీ కెమెరా గుర్తును, విద్యార్థుల రాజకీయ పార్టీకి బ్యాట్‌ గుర్తు, జన శంఖారావం పార్టీకి లేడీస్‌ ఫింగర్‌ గుర్తును కేటాయించింది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి వెళ్లాలని మొదట నిర్ణయించినప్పటికీ.. ఆ తర్వాత ఆ పార్టీ సానుకూలంగా స్పందించలేదని వైఎస్‌ షర్మిల తెలిపిన విషయం తెలిసిందే. ఓట్లు చీలకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ పార్టీతో కలిసి వెళ్లాలని అనుకున్నామని కానీ.. ఇప్పుడు మాత్రం ఒంటరిగానే వైయస్సార్టీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *