రాజమండ్రి:ఏపీలో అధికార వైసీపీపై ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యాయి టీడీపీ, జనసేన పార్టీలు. ఇందులో భాగంగానే ఏర్పడిన జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం రాజమండ్రిలో జరిగింది.జనసేన అధినేత పవన్కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధ్యక్షతన భేటీ జరిగింది.ఇప్పటికే రెండు పార్టీల నుంచి ఐదుగురు చొప్పున 10 మంది సమన్వయ కమిటీ సభ్యులను ఇరు పార్టీలు నియమించాయి. తొలి సారి రెండు పార్టీల మధ్య జరగనున్న ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో టీడీపీ, జనసేనల ఉమ్మడి పోరాటంతో పాటు సమన్వయంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. రెండు పార్టీలూ ఇప్పటికే సమన్వయ కమిటీలు నియమించాయి. ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి రెండు పార్టీలు కలిసి కార్యాచరణను రూపొందించినట్లు సమాచారం.అలాగే ఉమ్మడి సమావేశాల ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది.ఈ మేరకు ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలన్న దానిపై ఇరు పార్టీల నేతలు చర్చించనున్నారు.