రాజమండ్రి, అక్టోబరు 23: ఉభయ గోదావరి జిల్లాలకు ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ తలమానికంగా నిలుస్తోంది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ కట్టడం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతోంది. అధికారుల అలక్ష్యం, సర్కారు నిర్లక్ష్యంతో వారథి మనుగడకు ప్రమాదం ఏర్పడిరది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ 5.837 కిలోవిూటర్ల మేర దీన్ని నిర్మించారు. గతంలో ఈ బ్యారేజీ పైనుంచి ప్రయాణాలు సాగించేందుకు స్థానికులు, పర్యాటకులు మక్కువ చూపేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ధవళేశ్వరం నుంచి విజ్జేశ్వరం వరకూ కాటన్‌ బ్యారేజీపై ప్రయాణం అంటేనే బెంబేలెత్తుతున్నారు. గుంతలు పడిన ఈ రహదారిలో ప్రయాణం చేయలేక నానాపాట్లు పడుతున్నారు. తాజాగా రాజమహేంద్రవరంలో రోడ్డు కం రైల్‌ బ్రిడ్జిని మూసేయడంతో కాటన్‌ బ్యారేజీకి రద్దీ పెరిగింది. నిత్యం వేలాది మంది వాహనదారులు ఈ బ్యారేజీపై రాకపోకలు సాగిస్తున్నారు. గుంతల వల్ల కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. నాలుగు సంవత్సరాలుగా ఈ రహదారి పరిస్థితి మరింత దిగజారిరది. పూర్తిగా గుంతలమయంగా మారింది. 2014లో ధవళేశ్వరం, బొబ్బర్లంక, మద్దూరు, విజ్జేశ్వరం ఆర్మ్‌లను కలుపుతూ నిర్మించిన ఎంబ్యాక్‌మెంట్‌ రోడ్డుతోపాటు, ఆర్మ్‌లపై ఉన్న కాంక్రీట్‌ నిర్మాణంపై వేసిన బిటి లేయర్‌ కూడా పూర్తిగా ఛిద్రమైంది. అప్పటి నుంచి ఈ రోడ్డుకు ఆధునీకరణ పనులు చేపట్టలేదు. బ్యారేజీకి సపోర్టుగా ఉన్నగా ఉన్న పాత ఆనకట్ట పలుచోట్ల దెబ్బతింది. బీటలు వారి ప్రమాదాన్ని సూచిస్తోంది. పిచ్చుకలంక రేవులో రాళ్లు పైకిలేచిపోయాయి. బ్యారేజీ ఒడ్డున కోతకు గురికాకుండా ఉండేందుకు నిర్మించిన రాతి కట్టుబడి కూడా ఛిద్రమైంది.రహదారిపైన బిటి రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షల అంచనా వ్యయంతో ఇరిగేషన్‌ అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీనికి పరిపాలనా అనుమతి సైతం పొందారు. ఇప్పటికి ఆరుసార్లు టెండర్లు పిలిచారు. అయినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాలేదు. గతంలో పూర్తి చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం, ప్రస్తుతం పనిచేసినా సొమ్ములు వస్తాయో? రావో? అనే భయమే ఇందుకు కారణమని సమాచారం. గత పుష్కరాల సమయంలో బ్యారేజీపై తారు రోడ్డు నిర్మాణంతోపాటు రంగులు వేశారు. అనంతరం 5.837 విూటర్ల పొడవు ధవళేశ్వరం, ర్యాలి, మద్దూరు, విజ్జేశ్వరం మొత్తం నాలుగు ఆర్మ్‌లకు ఆధునీకరణ పనుల నిమిత్తం 2017`19లో ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించింది. 175 గేట్లలో 52 గేట్లకు చిన్నచిన్న మరమ్మతులు చేసి ఊరుకుంది. అనంతరం అలాగే వదిలేయడంతో గేట్లు ఎత్తేందుకు ఉపయోగించే జనరేటర్‌ దెబ్బతింది. స్టాప్‌లాక్‌ గేట్లకు సంబంధించిన క్రేన్‌ మరమ్మతులకు గురైంది.సర్‌ ఆర్దర్‌ కాటన్‌ బ్యారేజీ నిర్వహణ పట్ల పాలనా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ బ్యారేజీని తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదానిచ్చే ఉద్యాన వనాలు పూర్తిగా పాడయ్యాయి. బ్యారేజీ అందాలు తిలకించేందుకు వచ్చిన వారు సేద తీరేందుకు కనీస వసతులు కూడా ఇక్కడ లేవు. పుష్కరాల సమయంలో వేసిన ఫౌంటెన్లు పూర్తిగా పాడయ్యాయి.

 

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *