కాంగ్రెస్‌కు చెరుకు సుధాకర్ రాజీనామా
కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం లేదు:చెరుకు సుధాకర్
టికెట్ల కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన
హైదరాబాద్ ఒకబెర్ 20:: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఇప్పటికే జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరగా..నేడు డాక్టర్ చెరుకు సుధాకర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం లేదని, టికెట్ల కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తూ అగ్ర వర్ణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.నకిరేకల్ టికెట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న ఆయన, తన రాజీనామాకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒంటెద్దు పోకడలు కూడా కారణమన్నారు. కాగా, ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఎప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పార్టీని వీడుతారో తెలియని అయోమయం నెలకొందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.