కాకినాడ: రానున్న కాలంలో తెలుగుదేశం, జనసేన ఇరు పార్టీలు ఐక్య కార్యాచరణతో ప్రజలకు ముందుకు వెళ్తాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ వెల్లడిరచారు. కాకినాడ హెలికాన్ టైమ్స్ లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వలేని వైసిపి ప్రభుత్వం సిఎం జగన్ అర్దజ్ఞానంతో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయటానికి సిట్జర్లాండ్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ప్రజాధనం దుర్వినియోగం చేయటానికేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ సమావేశంలో జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేన పిఎసి సభ్యులు ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు తోట సుధీర్, నాయకులు పాఠంశెట్టి సూర్యచం ద్ర, వరుపుల తమ్మయ్యబాబు, అత్తి సత్యనారాయణ, తుమ్మల బాబు, శెట్టిబత్తుల రాజబాబు, తంగెళ్ళ ఉదయశ్రీనివాస్, పోలసపల్లి సరోజు, సుంకర కృష్ణవేణి, బట్టు లీల, బండి సూజాత తదితరులు పాల్గోన్నారు.