మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా నియమించిన రాజంపేట టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ రాజు
రాయచోటి: అన్నమయ్య జిల్లా కడప మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను మర్యాదపూర్వకంగా కలిసి దుశాలవాకప్పి గజమాలవేసి సన్మానించారు. అనంతరం రాజంపేట టిడిపి పార్లమెంటు అధ్యక్షులు జగన్ రాజును పూల బొకే ఇచ్చి సుగవాసి సుబ్రహ్మణ్యం సన్మానించిన అనంతరం సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మేమిద్దరం చిన్ననాటి నుంచి మంచి మిత్రులం తెలుగుదేశం పార్టీ లో ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్న జగన్ రాజు ఈరోజు ఈ పదవి రావడం చాలా సంతోషంగా భావిస్తున్ననని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరబల్లి మండల టిడిపి అధ్యక్షుడు భానుగోపాల్ రాజు. రాయచోటి సుమన్. సుండుపల్లి చిన్నబాబు. పెదబాబు. చంద్రశేఖర్. తదితరులు పాల్గొన్నారు.