త్రిపుర గవర్నర్‌ గా ఇంద్రసేన్‌
హైదరాబాద్‌, అక్టోబరు 19: : రెండు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించారు. త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్‌గా రఘుబర్‌ దాస్‌ లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. నల్లు ఇంద్రసేనారెడ్డి తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్‌ నేత, రఘుబర్‌ దాస్‌ రaార్ఖండ్‌ మాజీ సీఎం అని తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అధ్యక్షుడిగా నల్లు ఇంద్రసేనారెడ్డి సేవలు అందించారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా. మలక్‌పేట నుంచి గతంలో మూడు సార్లు బీజేపీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన సేవలు గుర్తించిన పార్టీ అధిష్టానం ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగానూ బాధ్యతలు అప్పగించింది. 2022లో బీజేపీ చేరికలు, సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా ఇంద్రాసేనారెడ్డి నియమితులయ్యారు. ఒడిశా గవర్నర్‌ గా నియమితులైన రఘుబర్‌దాస్‌ 2014 నుంచి 2019 వరకు రaార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. జాతీయ స్థాయిలో పార్టీకి ఉపాధ్యక్షుడిగా చేసిన అనుభవం ఆయన సొంతం.ఇంద్రసేనారెడ్డి సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో నల్లు రాంరెడ్డి, హనుమాయమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1972లో ఎం.ఎస్‌.సి పూర్తి చేసి, వరంగల్‌ లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి 1975లో ఎం.ఫీల్‌ పూర్తి చేశారు. విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే రాజకీయాల పట్ల ఆసక్తి కలిగింది. దాంతో 1980లో భారతీయ జనతా పార్టీ (ఃఏఖ)లో చేరారు ఇంద్రాసేనా రెడ్డి. ఆయన 1983, 1985, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మలక్‌పేట్‌ నియోజకవర్గం నుండి మూడుసార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1996, 2004లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్గొండ లోకసభ నియోజకవర్గం నుంచి, 2009లో మల్కాజ్‌గిరి లోకసభ నుంచి, 2014లో భువనగిరి లోకసభ స్థానానికి బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిచెందారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు.
రేవంత్‌ పై ఇంద్రసేన్‌ ఫైర్‌
రేవంత్‌రెడ్డిపై త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన నల్లు ఇంద్రసేనారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు పనితీరు ఏంటో మోడీకి తెలుసరి ఇంద్రసేనారెడ్డి ఫైర్‌ అయ్యారు. రెడ్లకు తానే ప్రతినిధినని రేవంత్‌ రెడ్డి అనుకుంటున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డినైన తనకు గవర్నర్‌ పదవి వచ్చిందనందుకు రేవంత్‌ రెడ్డి బాధ పడిపోతున్నారని మండిపడ్డారు. ఎంతసేపూ ఇతరులను ఇరకాటంలో పెట్టడమే రేవంత్‌ రెడ్డి పని అంటూ వ్యాఖ్యలు చేశారు. సొసైటీని డివైడ్‌ చేసుకునేందుకు రేవంత్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రెడ్లకు తానే ప్రతినిధినని రేవంత్‌ ఓపెన్‌గా అనేకసార్లు చెప్పారన్నారని స్పష్టం చేశారు. మోడీ స్వయంగా ఫోన్‌ చేసి త్రిపుర గవర్నర్‌గా నియమిస్తున్నట్లు చెప్పారని.. తన సిన్సియారిటీ గురించి ఏపీ, తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. ఎవరు పనితీరు ఏంటో మోడీకి తెలుసన్నారు. ఎప్పుడు ఎవరకి ఏ బాధ్యతలు ఇవ్వాలో వారికి తెలుసని చెప్పుకొచ్చారు. గతంతో పోల్చితే మోడీ హాయాంలో ఈశాన్య రాష్ట్రాలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయని నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు.త్రిపుర గవర్నర్‌గా తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఆయనను గవర్నర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్‌గా నియమితులైన తర్వాత ఇంద్రసేనారెడ్డి తొలిసారి స్పందించారు. బీజేపీలో ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు. గవర్నర్‌గా నియమితులైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. మలక్‌ పేట నియోజకవర్గ ప్రజలకు ఈ గుర్తింపు వస్తుందన్నారు. ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తానని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన వెల్లడిరచారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *