విజయవాడ, సెప్టెంబర్‌ 10: ప్రకాశం బ్యారేజీలో కొట్టుకు వచ్చిన బోట్ల వెనుక భారీ కుట్ర ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. వైసీపీకి చెందిన వాళ్లు బ్యారేజీని డ్యామేజ్‌ చేసే ఉద్దేశంతో వాటిని నదిలి వదిలి పెట్టారని తెలిపారు. అమరావతిలో ప్రెస్‌ విూట్‌ పెట్టిన వంగలపూడి అని.. అన్ని బోట్లు కలిసి ఒకే సారి బ్యారేజ్‌ ను తాకేలా చూశారన్నారు. ఇప్పటికే బోట్ల యజమానులను అరెస్టు చేశారు. బ్యారేజీని కూల్చడం ద్వారా పది లక్షల మందికిపైగా ప్రజల్ని రిస్కులో పెట్టాలనుకున్నారని.. ఇది దేశద్రోహమేనని హోంమంత్రి మండిపడ్డారు.ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదలు వచ్చినప్పుడు రాత్రికి రాత్రి ఐదు బోట్లు కొట్టుకు వచ్చాయి. రెండు బోట్లు దిగువకు వెళ్లిపోగా.. మూడు బోట్లు కౌంటర్‌ వెయిట్‌ కు ఢీకొని ఆగిపోయాయి. ఈ కారణంగా కౌంటర్‌ వెయిట్స్‌ ధ్వంసం అయ్యాయి. ఆ మూడు బోట్లలో ఇసుక ఉండంతో పాటు మూడు ఒకదానికి ఒకటి కలిపి కట్టేసి ఉండటంతో కుట్ర కోణం ఉందన్న ఆరోపణలు వచ్చాయి దీనిపై పోలీసులు దర్యాప్తు జరిపి ప్రభత్వానికి నివేదిక ఇచ్చారు. బోట్ల యజమానుల్ని అరెస్టు చేశారు.కృష్ణానదిలోకి కొట్టుకు వచ్చిన బోట్లు ఉద్దండరాయుని పాలెం వద్ద ఉండేవి. ఆ వైపుగా ఉండే.. బ్యారేజీ వైపు కొట్టుకు రాకుండా మధ్యలో ఎక్కడో చిక్కుకుపోతాయన్న ఉద్దేశంలో గొల్లపూజి వైపు తెచ్చి ఉంచారని పోలీసులు గుర్తించారు. సరిగ్గా లంగర్‌ వేయకుండా.. వరద వస్తే వెళ్లిపోయేలా.. ఒకదానితో ఒకటి కట్టి ఉంచడంతో స్థానికులు హెచ్చరించినా అదే పని చేశారు. వైసీపీ ఎమ్మెల్యే తలశిల రఘురాం వరుసగా మూడు రోజుల పాటు వచ్చి..ఆ బోట్లను పరిశీలించి వెళ్లారని పోలీసులు గుర్తించారు. మరో వైపు ఈ బోట్లలో ఇసుక కూడా ఉంది. ఈ బోట్లు నందిగం సురేష్‌ అక్రమ ఇసుక రవాణా కోసం వినియోగించారని పోలీసులు చెబుతున్నారు. నందిగరం సురేష్‌ అమరావతి ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలలో పూర్తి స్థాయిలో తన కనుసన్నల్లోనే ఉండేలా చూసుకున్నారని చెబుతున్నారు. కనీసం వంద లారీలతో రోజు ఇసుకను తరలించేవారని దానికి లెక్కా పత్రం ఉండేది కాదని అంటున్నారు… విచారణలో ఇవన్నీ బయటకు వస్తాయని చెబుతున్నారు. ఆ బోట్లకు వైసీపీ రంగులు వేసి ఉన్నాయి. ఈ కారణంగా అధికారులు ఎవరూ పట్టించుకోకుండా అడ్డుకోకుండా ఇసుక అక్రమ రవాణాకు కోడ్‌ గా ఆ గుర్తు వేశారని భావిస్తున్నారు. ఆ మూడు బోట్లు గేట్లకు కాకుండా కౌంటర్‌ వెయిట్లకు తగలబట్టి సరిపోయిందని.. గేట్లకు తలిగి ఉంటే బ్యారేజీకి డ్యామేజీ జరిగేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *