హైదరాబాద్, సెప్టెంబర్ 6: : యాక్టర్ రాజ్‌తరుణ్, లావణ్య కేసులో హైదరాబాద్ పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. లావణ్య చెబుతున్నట్టు కొన్ని విషయాలు నిజమేనంటూ కోర్టులో ఛార్జ్‌షీట్ వేశారు. ఇద్దరూ పదేళ్ల పాటు సహజీవనం చేశారని వివరించారు. ఒకే ఇంట్లో ఉన్నారని కూడా తేల్చారు. ఈ కేసులో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా పేర్కొన్నారు పోలీసులు. లావణ్య ఇంటిని కూడా సందర్శించి కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు