కేంద్ర ప్రభుత్వము వివిధ రకాల చేతి వృత్తులును ప్రోత్సాహించుటకు ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన
పథకం 17-9-2023 వ తేదీన ప్రారంబించటం జరిగినది. ఇందులకు సంబంధించి దిగువ తెలిపిన 18 రకాల
చేతి వృత్తుల వారికి కులం తో సంబంధం లేకుండా ఈ పథకం నందు నమోదు చేసుకొన వచ్చును.
ఈ నమోదు గ్రామ సచివాలయం నందు మరియు గ్రామ స్థాయి లో సిఎస్సి కేంద్రాల లో ఉచితంగా
నమోదు చేసుకొన వచ్చును.
ఈ కేంద్ర విశ్వకర్మ యోజన పథకమునకు క్రింది కుల వృత్తి వారు అర్హులు :
చర్మ కారులు
చెప్పులు కుట్టే వారు
బట్టలు ఉతికే రజకులు
బట్టలు కుట్టే దర్జీలు
చేపలవల తయారీ దారులు
బొమ్మల తయారీ దారులు
పూల దండలు అల్లే వారు
కత్తులు తయారు చేయువారు
వడ్రంగి
కమ్మరి
కుమ్మరి
క్షరకులు
తాపీ పని చేసేవారు.
పడవల తయారీ
సంప్రదాయ బొమ్మల తయరి ‘దారులు
బుట్ట/చాప/చీపుర్లు నేసేవారు
శిల్ప కళాకారులు
ఈ కేంద్ర విశ్వకర్మ యోజన పథకమునకు ఈ క్రింది అర్హతలు కలిగిన వారు అర్హులు :
– 18 సంవత్సరాల కంటే ఎక్కవ వయస్సు కలిగి వారి పూర్వీకుల నుండి కుటుంబ వృత్తిగా చేస్తున్న హస్తకళాకారులు ఈ విశ్వ కర్మ క్రింద నమోదు చేసుకోవడానికి అర్హులు.
– ఎంపిక చేయు లబ్దిదారుడు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రెడిట్ ఆధారిత పధకాల క్రింద రుణాలు పొంది ఉండ కూడదు(రుణాన్ని తిరిగి చెల్లించిన వారు PM విశ్వ కర్మ క్రింద అర్హులు.
– కుటుంబంలో ఒకరు మాత్రమే రిజిస్ట్రేషన్ కు అర్హులు, లబ్దిదారుల గుర్తింపునకు కులం తో సంబంధం లేదు.
ఈ విశ్వకర్మ ప్రోగ్రామ్ వలన కలిగే ప్రయోజనాలు :
– ఐ.డి కార్డు మరియు సర్టిఫికెట్ ఇవ్వబడును.
– ఆసక్తి కల వారికి 5-7 రోజుల శిక్షణ ఇవ్వబడును.
– శిక్షణ సమయంలో రోజుకు రూ 500/- ఇవ్వబడును
– రూ 15000/- ల విలువ కల టూల్ కిట్ ఉచితంగా ఇవ్వబడును.
– మొదటి విడత 1లక్ష లోన్(18 నెలల రీ పేమెంట్)
– రెండవ విడత 2 లక్షల లోన్(30 నెలల రీ పేమెంట్)
– పై రుణానికి సంవత్సరానికి 5% వడ్డీ మాత్రమే వసూలు చేయబడును.
గమనిక : ప్రదానమంత్రి విశ్వకర్మ యోజన పథకం క్రింద మీ సచివాలయం లోని డిజటల్ అసిస్టెంట్ దగ్గర గాని కామన్సర్విస్ సెంటర్ సందుగాని నమోదు చేసుకొనగలరు.
కావున ఈ సదవకాశాన్ని అన్నమయ్య జిల్లాలోని కులవృత్తుల వారు అందరూ సద్వినియోగ పరచుకోగలరని, అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ చామకూరి శ్రీధర్ తెలియజేశారు.