వివరాలు వెల్లడిరచిన బద్వేలు రూరల్ పోలీస్ సిఐ విక్రమ సింహ
బద్వేలు: బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపవరం మండలం బద్వేలు నెల్లూరు జాతీయ రహదారి పి పి కుంట చెక్పోస్ట్ వద్ద గురువారం ఐదు కోట్ల రూపాయల విలువచేసే బంగారం వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ విక్రమ సింహ తెలిపారు గురువారం ఉదయం పీ పీ కుంట చెక్ పోస్ట్ వద్దా సాధారణ ఎన్నికల సందర్భంగా వాహనముల ను తనిఖీ చేస్తుండగా సీక్వెల్ గ్లోబల్ ప్రీసియస్ లాజిస్టిక్స్ అను కంపనీ కి చెందిన బొలెరో వాహనమును నిలిపి తనిఖీ చేయగా అందులో బంగారు మరియు వెండి వస్తువులను సుమారు 29 కేజీ లను కనుగొనడం జరిగింది…సాధారణ ఎన్నికల సందర్భంగా అధిక మొత్తం లో బంగారు మరియు వెండి ఆభరణాలను ట్రాన్స్పోర్ట్ చేస్తున్న కారణంగా ను మరియు సమర్పించిన బిల్స్ మరియు ఇతర పత్రాలు సరైనవి అవునా కాదా అని నిర్ధారించకొని తదుపరి చర్య గురించి ఆభరణాలను అన్నిటినీ ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేసి ఆదాయ పన్ను జిఎస్టి అధికారులకు స్వాధీనపరిచినట్లు సీఐ తెలిపారు తనిఖీల్లో బద్వేలు రూరల్ ఎస్సై రవికుమార్ హెడ్ కానిస్టేబుల్ యాదవ్ కానిస్టేబుల్ సిద్ధారెడ్డి వ్యవసాయ అధికారి కరీం హెచ్ సి లక్ష్మీనారాయణ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు