జిల్లాలోని 1 పార్లమెంట్‌ నియోజకవర్గం , 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరణ
కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌

తిరుపతి: సార్వత్రిక ఎన్నికలు `2024 ప్రక్రియలో నోటిఫికేషన్‌ నేడు ఏప్రిల్‌ 18న విడుదల చేయడం జరిగిందనీ, నామినేషన్ల స్వీకరణ నేటి నుండి ప్రారంభమైందని కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.

గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌ నందు సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభనీ లో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్‌.పి కృష్ణ కాంత్‌ పటేల్‌ తో కలిసి పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా నామినేషన్ల పర్వం ఈరోజు నుంచి మొదలైందని ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పబ్లిక్‌ నోటీస్‌ ఫారం ` 1 ను జారీ చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని నియోజకవర్గాల ఆర్వోలు ఏర్పాట్లను పూర్తి చేసి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటి చేసే అభ్యర్ధులు కలెక్టరేట్‌ నందు, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఒక్కో అభ్యర్ధి గరిష్టంగా నాలుగు సెట్లను దాఖలు చేయవచ్చని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్ధితో పాటు మరో నలుగురిని మాత్రమే ఆర్‌ఓ కార్యాలయం వరకు అనుమతి ఇస్తారని, మిగిలిన వారిని 100 విూటర్ల అవతల నిలిపివేస్తారని అన్నారు. అభ్యర్ధితో మొత్తం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్యర్ధులు పార్లమెంటుకు రూ.25,000, ఎస్సీ అభ్యర్థి అయితే రూ.12,500, అసెంబ్లీకి రూ.10,000 , ఎస్సీ అభ్యర్థి అయితే రూ.5000 ధరావతు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఎన్నికల కమిషన్‌ సూచించిన నియమ నిబంధనల మేరకు నామినేషన్లను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరించడం జరుగుతుందని, ప్రభుత్వ సెలవు దినములలో నామినేషన్ల స్వీకరణ ఉండదని తెలిపారు. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను 26వ తేదీ స్కృటీని జరుగుతుందని, 29వ తేదీ వరకు నామినేషన్‌ ఉపసంహరణకు సమయం ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ అనంతరం అభ్యర్థుల జాబితా డిక్లేర్‌ చేసి సి.ఈ.ఓ కార్యాలయానికి అప్రూవల్‌ కొరకు పంపడం జరుగుతుందని అన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ అభ్యర్ధులు తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందని, ఈ నామినేషన్‌ ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లను స్వీకరించే గదిలో, అభ్యర్ధులు ప్రవేశించే ద్వారాల వద్దా సిసి కెమేరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మోడల్‌ కోడ్‌ అమల్లో భాగంగా అభ్యర్ధుల ఊరేగింపులను, నామినేషన్‌ దాఖలు చేసే కార్యక్రమాలను సైతం వీడియో రికార్డింగ్‌ చేస్తారన్నారు. అభ్యర్థులు నామినేషన్‌ దరఖాస్తు చేసినప్పటి నుండి వారు చేసే ఖర్చును వారి వ్యక్తిగత ఖాతాకు నమోదు చేయడం జరుగుతుందని, పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్‌ న్యూస్‌ వార్తలను సైతం అభ్యర్థి ఖాతాలో లెక్కించడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్‌ తేదీ కి 48 గం. ముందు ప్రింట్‌ విూడియాలో ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. ప్రింట్‌ విూడియా లో ప్రకటనలను పబ్లిషర్‌ పేరు చిరునామా వివరాలు ఉండాలని తెలిపారు. ఎలక్ట్రానిక్‌ విూడియా, సోషల్‌ విూడియా, కేబుల్‌ టివి నందు ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు.
పోటీలో ఉన్న అభ్యర్థులు తమపై క్రిమినల్‌ కేసులు పెండిరగ్‌లో ఉన్నట్లయితే లేదా అభ్యర్థి దోషిగా నిర్ధారించబడిన కేసుల గురించి డిక్లరేషన్‌ను ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు.ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ కొరకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 18 నుండి 22 వరకు గడువు ఉందని వీరికి ఫెసిలిటేషన్‌ సెంటర్‌ నందు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దీనిపై ప్రత్యేకంగా పత్రిక ప్రకటన ఇస్తామని తెలిపారు. పోలింగ్‌ కు హాజరయ్యే ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాల్లో పీడబ్ల్యూడి ఓటర్లకు, వృద్ధులకు వీల్‌ చైర్‌, త్రాగునీరు, షామియాన, మరుగుదొడ్లు తదితర కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ విూడియా సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్‌, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ విూడియా పాత్రికేయులు పాల్గొన్నారు .

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *