న్యూఢల్లీి, ఏప్రిల్‌ 1: రాజ కుటుంబాలు మాత్రం రాజ్యాలు పోయినా రాజ్యాధికారాన్ని మాత్రం వదులుకోవడం లేదు. ఒకప్పుడు వారసత్వంగా అధికారాన్ని పొందిన ఆకుటుంబాలు, ఇప్పుడు ప్రజల ఓట్లతో గెలుపొంది పరిమిత సామ్రాజ్యాన్ని పరిపాలించాలని చూస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో రాజ కుటుంబాలు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది, పదవులు అనుభవించాయి.ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు 2024 లోక్‌సభ ఎన్నికలలో రాజ కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ ఇష్టమైన పార్టీగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఏకంగా 12 రాజ కుటుంబాలు పోటీలో నిలిచాయి. వీరిలో 5 రాజ కుటుంబాలకు చెందినవారు తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, మరో 7 రాజ కుటుంబాలు తమ ప్రజాస్వామ్య రాజకీయాలను కొనసాగిస్తూ ఎన్నికల బరిలో నిలిచాయి. .లోక్‌సభలోనే కాదు.. రాజకుటుంబాలకు చెందిన ముగ్గురు నేతలు బీజేపీ తరఫున ఇప్పటికే రాజ్యసభలో ఉన్నారు. నిజానికి రాజకుటుంబాలకు చెందిన నేతలు ఐదుగురు ఉన్నప్పటికీ, వారిలో ఇద్దరి పదవీకాలం ఈ మధ్యనే పూర్తయింది. వారిలో కొందరు పార్టీ మారి బీజేపీలో చేరగా, మరికొందరు తొలిసారి ఎంపీలు అయ్యారు. ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ టీమ్‌లో ముగ్గురు మహారాజులు ఉన్నారు. గ్వాలియర్‌ మహారాజా జ్యోతిరాదిత్య సింధియాతో పాటు మణిపూర్‌ రాజు లిషెంబా సనజౌబా ఒకరు. సింధియా కుటుంబానికి భారతీయ జనతా పార్టీ కంటే ముందు ఉన్న జనసంఫ్‌ుతో కూడా సుదీర్ఘ అనుబంధం ఉంది. మణిపూర్‌ సనాజౌబాకు రాజకీయాలలో ఎటువంటి అనుభవం లేకపోగా.. బీజేపీ అభ్యర్థనపై నేరుగా పెద్దల సభకు వచ్చారురాజ్యసభలోని రాజకుటుంబానికి చెందిన 3వ నేత శివాజీ మహారాజ్‌ వారసుడు ఉదయ రాజే భోసలే. ఈ మధ్యనే పదవీకాలం పూర్తిచేసుకున్న రాజ కుటుంబీకుల్లో దుంగార్‌పూర్‌ రాజ కుటుంబానికి చెందిన హర్షవర్ధన్‌ సింగ్‌ ఒకరు. ఆయన ప్రముఖ క్రికెట్‌ అడ్మినిస్ట్రేటర్‌ రాజ్‌ సింగ్‌ దుంగార్పూర్‌ మేనల్లుడు. మరొకరు కొల్హాపూర్‌లో శివాజీ మహారాజ్‌ వారసుడు శంభాజీ రాజే. మరాఠా ఉద్యమానికి ముఖంగా మారిన శంభాజీ తొలిసారిగా రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఈ ఇద్దరి పదవీకాలం పూర్తి కావడంతో రాజ్యసభలో మిగిలిన రాజకుటుంబీకుల్లో జ్యోతిరాదిత్య సింధియా, లిషెంబా సనజౌబా, ఉదయరాజె భోసలే మిగిలారు. వీరిలో మణిపూర్‌ రాజకుటుంబీకులు సనజౌబా మినహా మిగతా ఇద్దరు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు కాబట్టి అక్కడ గెలిస్తే ఇక్కడ పదవిని వదులుకోవాల్సి వస్తుంది. అప్పుడు సనజౌబా ఒక్కరే రాజ్యసభలో రాజకుటుంబీకుడిగా మిగిలిపోతారు.కర్ణాటకలోని మైసూర్‌ రాజు నుంచి త్రిపుర రాజ కుటుంబంలోని రాణి వరకు బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాల్లో అనేక మంది చోటు సంపాదించుకున్నారు. దేశ రాజకీయాల్లో రాజకుటుంబాల ఆధిపత్యం కొత్త విషయం కానప్పటికీ, తమ చరిత్ర, కీర్తిని గుర్తించి ఎవరు గౌరవప్రదమైన పదవులు ఇస్తే ఆ పార్టీ వైపు రాజ కుటుంబాలు మొగ్గుచూపుతూ వచ్చాయి. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌ లేదా ఇతర రాజకీయ పార్టీలను ఇష్టపడ్డ రాజ కుటుంబాలు, మారిన పరిస్థితుల్లో టిక్కెట్‌ కోసం కమలదళం వెనుక క్యూ కడుతున్నాయి.దక్షిణాదిన మైసూరు రాజ కుటుంబానికి ఎంతో చరిత్ర ఉంది. మార్చి 13న విడుదల చేసిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో మైసూర్‌ లోక్‌సభ స్థానానికి సిట్టింగ్‌ ఎంపీ ప్రతాప్‌ సింహ టిక్కెట్‌ను రద్దు చేసింది. ఆ స్థానంనలో పార్టీ మైసూర్‌ రాజకుటుంబానికి చెందిన యదువీర్‌ కృష్ణదత్‌ చామరాజ వడియార్‌ను రంగంలోకి దించింది. యదువీర్‌ కంటే ముందు ఆయన తాత శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్‌ రాజకీయాల్లో ఉన్నారు. కాకపోతే 1999 వరకు మైసూర్‌ స్థానం నుంచి ఆయన నాలుగుసార్లు కాంగ్రెస్‌ ఎంపీగా కొనసాగారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొని రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి యదువీర్‌ కాషాయ జెండా పట్టుకుని బరిలోకి దిగారు.బీజేపీ విడుదల చేసిన జాబితాలో త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానం నుంచి కీర్తి సింగ్‌ దేవ్‌ వర్మ పేరును బీజేపీ ప్రకటించింది. అక్కడ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న రేవతికి పార్టీ టికెట్‌ నిరాకరించింది. కీర్తి వర్మ మాణిక్య రాజ కుటుంబానికి చెందిన యువ రాణి. ఆమె తిప్ర మోతా పార్టీ నేత ప్రద్యోత్‌ దేవ్‌ వర్మకు సోదరి. తిప్ర మోత పార్టీ ఇటీవల ఎన్డీఏ కూటమిలో చేరి ఇప్పుడు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన విషయం తెలిసిందేఈ క్రమంలో మూడో పేరు మాళవిక కేశరి దేవ్‌. బీజేపీ ఒడిశాలో మాళవిక కేశరీ దేవ్‌ను బరిలోకి దింపింది. ఆమె కలహండి రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. మాళవిక బిజూ జనతా దళ్‌ మాజీ ఎంపీ అర్కా కేశరి దేవ్‌ భార్య. 2023లో వీరిద్దరూ బీజేపీలో చేరారు.రాజ కుటుంబాల నుంచి పోటీలో ఉన్నవారిలో 4వ పేరు రాజ్‌సమంద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మహిమా కుమారి విశ్వరాజ్‌ సింగ్‌ మేవార్‌. మేవార్‌ రాజకుటుంబానికి చెందిన విశ్వరాజ్‌ సింగ్‌ భార్య మహిమ. ఈసారి విశ్వరాజ్‌ సింగ్‌ రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. నాథ్‌ద్వారా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాజ్‌సమంద్‌ స్థానం నుంచి పార్టీ ఆయన భార్య మహిమకు టిక్కెట్‌ ఇచ్చింది.రాజ కుటుంబాలకు చెందిన 5వ అభ్యర్థిగా బెంగాల్‌లో రాజమాత అమృత రాయ్‌ను చూడవచ్చు. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మోయిత్రాపై బీజేపీ రాజమాతా అమృతా రాయ్‌ను పోటీకి నిలబెట్టింది. రాయ్‌ కృష్ణనగర్‌ రాజకుటుంబానికి చెందిన నేత. ఆ ప్రాంతంలో రాజమాత అని సంబోధిస్తారు.రాజకుటుంబాల నుంచి తొలిసారి బరిలోకి దిగిన ఈ ఐదుగురు అభ్యర్థులే కాకుండా, ఇప్పటికే ఎన్నికల రాజకీయాల్లో ఉన్న కొందరు రాజ కుటుంబాల అభ్యర్థులు ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. వీరిలో సతారా, పాటియాలా, గ్వాలియర్‌, బోలంగీర్‌, రaలావర్‌ రాజ కుటుంబాల వారసులు ఉన్నారు.ఛత్రపతి శివాజీ వారసుడు, ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఉదయరాజే భోసలే ఈసారి సతారా లోక్‌సభ స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డారు. 2019లో ఉదయ్‌ భోసలే నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఔఅఖ) టికెట్‌పై గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరేందుకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీ ఆయనను రాజ్యసభకు నామినేట్‌ చేసింది.మరోవైపు పాటియాలా మాజీ కాంగ్రెస్‌ ఎంపీ ప్రణీత్‌ కౌర్‌ బీజేపీలో చేరారు. ప్రణీత్‌ కౌర్‌ పాటియాలా రాజకుటుంబానికి చెందిన మహిళగానే కాదు, కింగ్‌ కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ భార్య. ఇదిలా ఉంటే గ్వాలియర్‌ మహారాజు జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే బీజేపీలో రాజ్యసభ ఎంపీగా, కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియా తొలిసారి ‘గుణ’ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారుఒడిశాలో పట్నాఘర్‌`బోలంగీర్‌ రాజకుటుంబానికి చెందిన బొలంగీర్‌ సిట్టింగ్‌ ఎంపీ సంగీతా కుమారి సింగ్‌ దేవ్‌కు బీజేపీ ఈసారి టిక్కెట్‌ ఇచ్చింది. అలాగే రాజస్థాన్‌ రaలావర్‌`బరన్‌ నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన బీజేపీ నేత దుష్యంత్‌ సింగ్‌ మరోసారి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సింగ్‌ ధోల్పూర్‌ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి.ఛత్తీస్‌గఢ్‌లోని షాదోల్‌ రాజకుటుంబానికి చెందిన హిమాద్రి సింగ్‌ పేరు కూడా బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఉంది. హిమాద్రి సింగ్‌ 2019లో కూడా బీజేపీ టికెట్‌పై గెలిచారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ రాజ కుటుంబానికి చెందిన రాణి లక్ష్మీ షా పేరు సైతం ఈసారి జాబితాలో చేరింది. మహారాణి మాలా రాజలక్ష్మి షాకు గతంలో కూడా తెహ్రీ గఢ్వాల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టిక్కెట్‌ ఇవ్వగా ఆమె విజయం సాధించారు.2019లో బీజేపీ నుంచి లోక్‌సభ టిక్కెట్లు పొందిన రాజకుటుంబానికి చెందిన నేతలను పరిశీలిస్తే.. వారిలో అత్యధికులు సంప్రదాయబద్ధంగా ఆ పార్టీతో అనుబంధం ఉన్న నేతలే ఉన్నారు. ఇందులో మొత్తం ఆరుగురు రాజకుటుంబ వారసులు బీజేపీ టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేశారు. రaలావర్‌ నుండి దుష్యంత్‌ సింగ్‌, బోలంగీర్‌ నుండి సంగీతా సింగ్‌ దేవ్‌, షాడోల్‌ నుండి హిమాద్రి సింగ్‌, మణిపూర్‌ రాజ్‌ కుమార్‌ రంజన్‌ సింగ్‌, తెహ్రీ గర్వాల్‌ నుండి మాలా రాజ్లక్ష్మి షా, జైపూర్‌ ఘరానాకు చెందిన దియా కుమారి పేర్లు ఉన్నాయి. ఈ ఆరుగురిలో నలుగురు ఈసారి కూడా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అయితే రాజ్‌కుమారి గత ఏడాది జరిగిన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఆమె రాజస్థాన్‌ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. మణిపూర్‌ ఇన్నర్‌ నుండి గెలిచి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌కు ఈసారి టికెట్‌ ఇవ్వలేదు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *