ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు…
ముఖ్యమంత్రి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం భూమి పూజ విజయవంతం చేసేందుకు సహకరించండి
భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, డి ఐ జి , ఎస్పీ…
కర్నూలు: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కర్నూలు నగర సవిూపంలోని జగన్నాథ గట్టుపై ఈనెల 14 వ తేదీన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్న సందర్భంగా హెలిపాడ్, సభాస్థలి వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన , డీఐజీ సి హెచ్ విజయా రావు ,ఎస్పీ కృష్ణ కాంత్ పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ , డీఐజీ లు ఎస్ పి సూచించారు.హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చే ప్రముఖుల ను ఒక పద్ధతి ప్రకారం తీసుకొని పోయే ఏర్పాటు ఉండాలని సూచించారు. రోప్ పార్టీ చాలా చురుగ్గా వ్యవహరించాలని సూచించారు.
ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల సూచనల మేరకు ప్రాంగణం మొత్తం బారి కేడిరగ్ లు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ముఖ్యమంత్రి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం భూమి పూజ కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ , డి ఐ జి , ఎస్పి అధికారులను కోరారు.
ఈ పర్యటనలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ ప్రాజెక్ట్ డైరెక్టర్ జయరాం రెడ్డి , సీఎం సెక్యూరిటీ అధికారి విశ్వనాథం , డి.ఎస్.పి విజయ్ శేఖర్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ , కల్లూరు తహశీల్దార్ మునివేలు , విద్యుత్ శాఖ డీఈ సుబ్బన్న మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.