నెల్లూరు: సీఎం జగన్‌ కి ఓ సీఎం జగన్‌ కు నూర్‌ భాష్‌ / దూదేకుల సంఘం వైకాపా కోస్తా ఆంధ్ర కన్వీనర్‌ కె .పీర్‌ మహమ్మద్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.నూర్‌ భాష్‌ /దూదేకుల కమ్యూనిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని వైస్సార్సీపీ దూదేకుల కమ్యూనిటీ కోస్తాంధ్ర కన్వీనర్‌ కె. పీర్‌ మహమ్మద్‌ కొనియాడారు.ఎన్నో దశాబ్దాలుగా ?ఎంకెకదూదేకుల వారిని సినిమాలలో సమాజంలో పలు సందర్భాలలో కులం పేరుతో దూషిస్తున్న సమయంలో ఎన్నో పర్యాయాలు ప్రభుత్వాలకు విన్నదించుకున్నప్పటికీ దూదేకుల వారికి న్యాయంజరగలేదన్నారు.
2019 వైయస్సార్సీపి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో సమస్యను తీసుకెళ్లిన వెంటనే జీవ రూపంగా ఇచ్చిన ఘనత జగన్మోహన్‌ రెడ్డిదే అని తెలియజేశారు. వైఎస్‌ఆర్‌ షాదితోఫా ద్వారా పేద ముస్లిం పిల్లల వివాహ సమయంలో లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా, మదరసాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంప్లిమెంట్‌ చేసిన ఘనత కూడా వైఎస్‌ఆర్సిపి ప్రభుత్వానిదేనని ఈ సందర్భంగా తెలియజేశారు.దూదేకుల వారిని కులంపరంగా దూషిస్తే ఐపీసీ సెక్షన్‌ 1860 కింద చట్టపరంగా శిక్షార్హులని ప్రభుత్వం జీఓ జారీ చేయడం హర్షించదగ్గ విషయమని అందుకు ప్రతి నూర్‌ భాషా సోదర సోదరీమణులు జగన్‌ కి కృతజ్ఞత అభివందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోస్తాంధ్ర రాయలసీమ కన్వీనర్లు షేక్‌ సలీం, డాక్టర్‌ డి మస్తానమ్మ, మరియు సంఘ నాయకులు ఖాజావలి, షరీఫ్‌, నాగయ్య విూరా సాహెబ్‌ తదితరులులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *