కొవిడ్ స్ట్రెయిన్ అంత ప్రమాదకరమైనది కాదు
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఢల్లీి ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్
న్యూఢల్లీి డిసెంబర్ 26 : : కరోనా న్యూ స్ట్రెయిన్ (ఏఔ.1) వేగంగా విస్తరిస్తుండటంపై ఢల్లీి ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కొవిడ్ స్ట్రెయిన్ అంత ప్రమాదకరం ఏవిూ కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా బాధితుల కోసం ఆస్పత్రుల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.‘దేశంలో విస్తరిస్తున్న కొవిడ్ న్యూ స్ట్రెయిన్ ఒమిక్రాన్ రకం కరోనా వైరస్‌కు సబ్ వేరియంట్. ఇది రెండు రూపాల్లో ఉంది. ఈ రెండు రూపాలు కూడా ప్రమాదకరం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే తప్ప భయాందోళనలు సృష్టించకూడదు. కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలపై సవిూక్ష నిర్వహిస్తున్నాం’ అని ఢల్లీి ఆరోగ్య మంత్రి చెప్పారు.