భూమికి తిరిగొచ్చిన నాసా ‘వ్యోమనౌక’
450కోట్ల ఏళ్ల నాటి సౌర కుటుంబ విషయాలు వెలుగులోకి
భూమి, సూర్యుడు సహా సౌర కుటుంబం ఎలా పుట్టింది? పుడమిపై నీరు, జీవం ఎక్కడి నుంచి వచ్చాయి? మానవాళికి చిక్కుముడిగా ఉన్న ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ‘ఒసైరిస్-రెక్స్’ వ్యోమనౌక దిగ్విజియంగా భూమికి తిరిగి వచ్చింది. ఏడేళ్ల పాటు రోదసిలో ప్రయాణించి బెన్ను అనే గ్రహశకలం నుంచి నమూనాలను భూమికి తీసుకొచ్చింది. అది విప్పబోయే గుట్టుమట్లు.. ఇప్పుడు శాస్త్ర సమాజానికి ఆసక్తికరంగా మారాయి. విశ్వ రహస్యాలను తెలుసుకునేందుకు మరో అడుగు ముందుకు పడింది. సౌర కుటుంబం, భూమి వాటి పుట్టుక సహా ఎన్నో ప్రశ్నలకు జవాబు కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఒసైరిస్-రెక్స్’ విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది. సౌర కుంటుంబం, భూమి వాటి పుట్టుక సహా ఎన్నో ప్రశ్నలకు జవాబు కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఒసైరిస్-రెక్స్’ విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది. దాదాపు ఏడేళ్ల పాటు రోదసిలో ప్రయాణించి బెన్ను అనే గ్రహాం నుంచి శకలం నుంచి నమూనాలను భూమికి తీసుకొచ్చింది. ఆదివారం రాత్రి 8.30 గంటలకు శాంపిల్ క్యాప్సూల్ పుడమికి చేరింది. భూఉపరితలానికి లక్ష కిలోమీటర్ల దూరంలో ఉండగా వ్యోమనౌక నుంచి శాంపిల్ క్యాఫ్య్సూల్ విడిపోయింది. ఆ తర్వాత నాలుగు గంటలు ప్రయాణించాక క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం 13 నిమిషాల పాటు దట్టమైన వాతావరణాన్ని చీల్చుకుంటూ గంటకు 44 వేల 500 కిలోమీటర్ల వేగంతో నేల దిశగా దూసుకొచ్చింది. ఆ సమయంలో గాలి రాపిడి వల్ల చెలరేగిన 3వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను ఉష్ణ రక్షణ కవచం సాయంతో తట్టుకోగలిగింది. పారాచూట్లు దశలవారీగా విచ్చుకొని క్యాప్సూల్ వేగాన్ని తగ్గించాయి. అమెరికాలోని యూతా ఎడారిలో నిర్జన ప్రాంతంలో అది సురక్షితంగా దిగింది. హెలికాప్టర్లో వచ్చిన బృందాలు దీన్ని సేకరించి, సమీపంలోని తాత్కాలిక క్లీన్ రూమ్‌లోకి తరలించాయి. ఆ తర్వాత హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు పంపుతారు. 450 కోట్ల ఏళ్ల కిందట సార కుటుంబం పుట్టుకకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.