ప్రవల్లిక ఆత్మహత్య కేసు..
పలువురు నేతలపై కేసులు నమోదు
హైదరాబాద్: ప్రవల్లిక ఆత్మహత్య పై ఆందోళన చేసిన రాజకీయ, విద్యార్ది నాయకులపై కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 13 మందిపై చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేసారు. సెక్షన్స్ 143, 148, 341, 332 రెడ్ విత్ ఐపిసి కింద కేసులు నమోదయ్యాయి. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, కార్పొరేటర్ విజయ రెడ్డి, ఓయూ నేత సురేష్ యాదవ్, భాను ప్రకాష్, నీలిమ, జీవన్ లపై కేసులు పెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారని అభియోగాలపై కేసులు నమోదు అయ్యాయి. ప్రవల్లిక చనిపోవడానికి కారణం గ్రూప్ టు పరీక్షలు కారణమంటూ రాజకీయ నాయకులు, విద్యార్ది నేతలు అందోళన చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, అభ్యర్థి ప్రవళ్లిక ఆత్మహత్య కేసులో ఆమె స్నేహితుడు శివరాం రాథోడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో మోసం చేయడంతోనే తమ కూతురు చనిపోయిందని ప్రవళ్లిక తల్లి విజయ ఆరోపించింది. దీంతో పరారీలో ఉన్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.