అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ సహకారం, స్థానిక జిల్లా అధికారుల తోడ్పాటుతో స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్ని రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటులో అందరి సహకారంతో ముందడుగు వేసిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కార్యాలయాలకు అవసరమైన స్థలాల కేటాయింపులో అధికారులతో కలిసి తీసుకుంటున్న చొరవ అందరి మన్ననలను అందుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రం పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు అన్నిటిని గుర్తించి వాటిలో కలెక్టరేట్, ఎస్పీ ఇతర జిల్లా కార్యాలయాలకు అవసరమైన స్థలాల కేటాయింపుల్లో కూడా ఎమ్మెల్యేశ్రీకాంత్ రెడ్డి చొరవ ప్రశంసనీయం.
 బంగ్లాల నిర్మాణాలకు స్థలాల కేటాయింపు:
జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ నివాసాలకు అవసరమైన బంగ్లాలలో ఏర్పాటుకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి ఆ ప్రాంతంలో జిల్లా ఉన్నతాధికారులకు అవసరమైన బంగ్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుత కలెక్టరేట్ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న ఐదు ఎకరాల పైబడిన స్థలంలో ఈ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు తెప్పించారు. జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ సహకారంతో గుట్టలుగా ఉన్న ప్రాంతాన్ని చదునుగా చేయించారు. ఇప్పటికే ఆ ప్రాంత సమీపంలోనే స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం డిఎస్పీ కార్యాలయం భవనాలను అద్భుతంగా తీర్చిదిద్ది వినియోగంలోకి తెచ్చారు.

16న భూమి పూజ:
జిల్లా కలెక్టర్ బంగ్లా నిర్మాణానికి ఈనెల 16వ తేదీన ఉదయం 10 గంటలుకు భూమి పూజ చేయనున్నారు. రాజంపేట పార్లమెంట్ సభ్యులు పీవీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష లు ముఖ్య అతిథులుగా ఈ భూపూజకు హాజరవుచున్నారు .ఇప్పటికే బంగ్లాల నిర్మాణ ప్రాంతాన్ని పూర్తిగా చదును చేశారు.
*
అద్భుత నిర్మాణాలను చేపడతాం:
అన్నమయ్య జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిధులతో నిర్మించనున్న జిల్లా కలెక్టర్ల బకలాలను ఆధునిక సాంకేతికతను చోటుచేసుకుని పురాతన బంగ్లాల కు ఏమాత్రం తీసుకొని విధంగా జిల్లా కలెక్టర్, జెసి, డిఆర్ఓ బంగ్లాలను నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం జిల్లా పోలీస్ కార్యాలయం ఇతర జిల్లా కార్యాలయం కూడా చూడ ముచ్చటగా, ప్రజలకు అనువుగా ఉండేలా భవనాలను నిర్మిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *