అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహిస్తారు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికన్‌ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్‌ రూజ్‌వెల్ట్‌, 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్త్రీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్‌ అన్న పదాన్ని పీపుల్‌గా మార్చింది. మహిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం పోరాటం చేసిన ఎలానార్‌ రూజ్‌వెల్ట్‌ పుట్టిన రోజైన అక్టోబరు 11ను అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. 2012, అక్టోబరు 11న తొలిసారిగా ఈ దినోత్సవం జరుపబడిరది. ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు (విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహం)పై, వివక్షతపై అవగాహన పెంచడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం.  వాషింగ్టన్‌ లోని యునైటెడ్‌ స్టేట్స్‌ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ 2014లో అందించిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 62 మిలియన్లకు పైగా బాలికలకు విద్య అందడంలేదు. ప్రపంచవ్యాప్తంగా 5 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలు, అదే వయస్సు గల అబ్బాయిల కంటే 160 మిలియన్‌ గంటలకుపైగా ఇంటి పనుల కోసం తమ సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా, నలుగురిలో బాలికల్లో ఒకరికి 18 ఏళ్ళకంటే ముందుగానే వివాహం జరుగుతోంది. 2016, అక్టోబరు 11న, ఐక్యరాజ్యసమితి వుమెన్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌ ఎమ్మా వాట్సన్‌, బలవంతపు బాల్య వివాహాలను అంతం చేయాలని ప్రపంచ దేశాలను, కుటుంబాలను కోరింది.  అభివృద్ధి చెందుతున్న దేశాలలో బాలికలను సంరక్షించే ప్రాముఖ్యతపై అవగాహన పెంచుతుంది. కెనడాలోని ప్లాన్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధులు కెనడియన్‌ ఫెడరల్‌ ప్రభుత్వాన్ని సంప్రదించి మద్దతుదారుల కూటమిని కోరుతూ అంతర్జాతీయంగా అవగాహన పెంచుతూ, చివరికి ఐక్యరాజ్య సమితిని కూడా ఇందులో పాల్గొనాలని కోరింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కెనడా తన తీర్మానంతో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని అధికారికంగా ప్రతిపాదించింది. కెనడా మహిళామంత్రి రోనా అంబ్రోస్‌ ఈ తీర్మానాన్ని స్పాన్సర్‌ చేసిందిÑ 55వ ఐక్యరాజ్యసమితి కమిషన్‌లో మహిళల స్థితిగతులపై మద్దతుగా మహిళలు, బాలికల ప్రతినిధి బృందం ప్రదర్శనలు చేసింది. 2011, డిసెంబరు 19న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 2012, అక్టోబరు 11న తొలి అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఆమోదించే తీర్మానానికి ఓట్లు వేయగా, అధికారికంగా బాలికా దినోత్సవం గుర్తించబడిరదిని తీర్మానం పేర్కొంది.
ఈ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం ఒక నేపథ్యాన్ని కలిగి ఉంటుంది.2012లో బాల్యవివాహాన్ని రూపుమాపడం, 2013లో బాలికల విద్య కోసం నూతననత్వం, 2014లో కౌమార బాలికలను సాధికారపరచడం, హింసను రూపుమాపడం. 2015లో కౌమార బాలికల శక్తి, విజన్‌ ఫర్‌ 2030, 2016లో బాలికల పురోగతి ,లక్ష్యాల పురోగతి, బాలికల గణనలు. 2017లో సాధికారిక బాలికలు, సంక్షోభాలకు ముందు, తరువాత,2018లో ఆమెతో ఒక నైపుణ్య బాలికల బృందం. 2013 నాటికి ప్రపంచవ్యాప్తంగా బాలికా దినోత్సవం సందర్భంగా సుమారు 2,043 కార్యక్రమాలు, వేడుకలు జరిగాయి.   2012లో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా టీ`షర్టులను పంపిణీ చేశాయి, 1956లో జరిగిన బ్లాక్‌ సాష్‌ మార్చ్‌ను 20,000 మంది మహిళలు గుర్తుచేసుకున్నారు. 2013లో లండన్‌ సౌత్‌ బ్యాంక్‌లో ఈ దినోత్సవం సందర్భంగా రోజంతా ఒక కార్యక్రమం జరిగింది, ఇందులో బాడీ గాసిప్‌ నిర్మించిన నాటక, సినిమా ప్రదర్శనలు జరిగాయి. ఇది శరీర అకృతి, మానసిక ఆరోగ్య సమస్యలపై ప్రచారం చేస్తుంది. వేలాది మంది కార్యకర్తలను, సంస్థలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి సేజ్‌ గర్ల్‌, ఐట్విక్సీ సంస్థలు ఒక అంతర్జాల వేడుకను కూడా రూపొందించాయి.2016లో లండన్‌ విమెన్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ (వావ్‌) అనే సంస్థ ఒక వేడుకను నిర్వహించింది, ఇందులో 250మంది లండన్‌ పాఠశాల బాలికలు, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2016లో, యునైటెడ్‌ స్టేట్స్‌ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా లింగ అసమానతను రూపుమాపడానికి ఒక ప్రకటన విడుదల చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *