అన్నమయ్య జిల్లా,రాయచోటి నియోజకవర్గం: ప్రముఖ వైద్యులు, మాజీ ఉర్దూ ఆకాడమీ చైర్మన్ డా దాదా సాహెబ్ మృతిపట్ల ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.రాయచోటి పట్టణంలోని హెచ్ పి పెట్రోల్ బంక్ పక్క వీధిలోని వారి నివాసంలో శనివారం డా: దాదా సాహెబ్ భౌతిక కాయాన్ని ఎంఎల్ఏ   సందర్శించి నివాళులు అర్పించారు. దాదా సాహెబ్ ప్రజలుకు చేసిన సేవలను శ్రీకాంత్ రెడ్డి గుర్తుకుచేసుకున్నారు.
మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, ప్రముఖ వైద్యులు డా బయారెడ్డి, డా నారాయణరెడ్డి, వైఎస్ఆర్ సిపి మదనపల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్,  కౌన్సిలర్లుఆసీఫ్ అలీ ఖాన్,కొలిమి ఛాన్ బాష, ఫయాజ్ ఆహమ్మద్, గౌస్ ఖాన్,అల్తాఫ్,సున్నా తదితరులు నివాళులర్పించారు.

 నివాళులర్పించిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి:   ప్రముఖ వైద్యులు, మాజీ ఉర్దూ ఆకాడమీ చైర్మన్ డా దాదా సాహెబ్  మృతి చెందిన విషయం తెలిసిన రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువనేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి ఇంటి వద్దకు వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దాదా సాహెబ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం ప్రభుత్వం లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా, మైనారిటీ నాయకులు, ప్రముఖ వైద్యులు గా  డాక్టర్ దాదే సాహెబ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నా రని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

సంతాపం తెలియజేసిన మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు  :

రాయచోటి పట్టణంలో ప్రముఖ వైద్యునిగా, సంఘ సేవకునిగా,తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా,మైనారిటీ నాయకునిగా రాయచోటి ప్రజలకు విశేష సేవలందించిన డా: దాదాసాహెబ్ గారు మృతిచెందడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని,ఆయన సేవలు రాయచోటి ప్రజలు ఎన్నటికీ మరవరని మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు.  వారి కుటుంభ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంతాపం తెలియజేసిన రాజంపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చమర్తి జగన్మోహన్ రాజు :

రాయచోటి పట్టణంలో ప్రముఖ వైద్యునిగా, సంఘ సేవకునిగా,తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా,మైనారిటీ నాయకునిగా రాయచోటి ప్రజల తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలకు విశేష సేవలందించిన డా: దాదాసాహెబ్   మృతిచెందడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని,ఆయన సేవలు రాయచోటి ప్రజలు తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎన్నటికీ మరవరని రాజంపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. దాదా సాహెబ్ మృతిపట్ల తన సంతాపం తెలియజేస్తూ,వారి కుటుంభ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *