విజయవాడ, సెప్టెంబర్‌ 18: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉదయం 11 గంటలకు మొదలైంది. సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పలు ప్రధాన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో న్యూ లిక్కర్‌ పాలసీ నివేదికకు ఆమోదం తెలిపారు. ఇటీవలే బుడమేరు బెజవాడను ముంచెత్తిన విషయం తెలిసిందే. భవిష్యత్‌ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. బుడమేరుకు మరమ్మతులు, లైనింగ్‌ పనులు చేయించేందుకు ఆమోదం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే రేపటి నుంచి రాష్ట్రంలో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం కానుండగా.. వాటిపై కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. గత పాలకుల హయాంలో కీలకంగా ఉన్న వాలంటీర్ల వ్యవస్థపై సుదీర్ఘంగా చర్చించింది.ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు ఉంచాలని.. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు నూతన మద్యం పాలసీకి బుధవారం ఆమోదం తెలిపింది
ఏపీ కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
కొత్త మద్యం విధానానికి ఆమోదం
అందుబాటులోకి నాణ్యమైన బ్రాండ్లు, సగటు మద్యం ధర రూ.99గా నిర్ణయం
భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు
వాలంటీర్‌ వ్యవస్థపై సుదీర్ఘ చర్చ
ఏపీ కేబినెట్‌ సమావేశానికి ముందు మంత్రి నారా లోకేష్‌.. ఇతర మంత్రులతో తన ఛాంబర్‌ లో సమావేశమయ్యారు. ఆయన నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌ కు మంచి స్పందన వస్తోందని, ప్రజలు తనకు ఇచ్చిన వినతులను సంబంధిత మంత్రులకు అందజేసి.. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
అక్టోబరు 1 నుంచి కొత్త పాలసీ
2019 కంటే ముందు రాష్ట్రంలో అమలులో ఉన్న లిక్కర్‌ పాలసీనే తీసుకు రావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే ఎంతో కొంత తక్కువగా మద్యం ధరలు ఉండేలా లిక్కర్‌ పాలసీ ఉంటుందని చెబుతున్నారు. ఏయే ప్రాంతాల్లో ఎన్ని మద్యం దుకాణాలను నోటిఫై చేయాలి, దరఖాస్తు రుసుములు, నాన్‌ రిఫండబుల్‌ ఛార్జీలు, లైసెన్సు రుసుములు ఎలా ఉండాలి? తదితర అంశాలపై ప్రతిపాదనలను గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ ఇప్పటికే అధ్యయనం చేశారు. ఇక వినియోగదారులు కోరుకునే అన్ని బ్రాండ్లూ అందుబాటులో ఉంచాలని మంత్రుల బృందం తీర్మానించింది. కేబినెట్‌ ఆమోదం తర్వాత?అక్టోబర్‌ 1 నుంచి కొత్త మద్యం పాలసీని తీసుకు రానున్నారు.గత ప్రభుత్వ హయాంలో సర్కారీ దుకాణాల పేరుతో జే బ్రాండ్‌ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ మద్యాన్ని సరసమైన ధరలకు అందిస్తామన్నారు.క్షేత్ర స్థాయి అధ్యయనంతో పాటు సీఎం చంద్రబాబు సూచనలతో కొత్త లిక్కర్‌ పాలసీని రూపొందించామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్‌. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా.. మద్యం అమ్మకాలు ఉండబోతున్నాయన్నారు నాదెండ్ల.పక్క రాష్ట్రాల ధరలతో పోటీ పడేలా, అందరికీ అందుబాటులో ఉండేలా, లిక్కర్‌ పాలసీలో ప్రతిపాదనలు చేశామన్నారు మంత్రి సత్యకుమార్‌.క్వాలిటీకి పెద్ద పీట వేయడంతో పాటు రేట్లు కూడా మందుబాబులకు అందుబాటులో ఉండేలా కొత్త లిక్కర్‌ పాలసీ రూపుదిద్దుకుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *