మచిలీపట్నం:సాక్షి పత్రిలో మహిళలను కించపరుస్తూ నీచపు రాతలను ఖండిస్తున్నాం. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా జగన్‌ రెడ్డీ అని కృష్ణా జిల్లా టీడీపీ మహిళ అధ్యక్షరాలు తలశిల స్వర్ణలత ప్రశ్నించారు. సాక్షి పత్రికలో మహిళలను కించపరుస్తూ వార్తలు రాయడం దుర్మార్గం. మహిళాభ్యుదయం, మహిళా సంక్షేమం, మహిళా భద్రత అంటూ గడిచిన ఐదేళ్లూ ప్రచారార్భాటాలు చేసిన జగన్మోహన్‌ రెడ్డి సొంత పత్రికలో మహిళను తీవ్రంగా అవమానిస్తూ తన నైజాన్ని బయటపెట్టుకుంటున్నాడు. జత్వానీకి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా మద్దతు తెలుపుతుంటే జగన్‌ రెడ్డి మాత్రం దోషులను కాపాడేందుకు సాక్షిలో దిగజారుడు రాతలు రాయిస్తున్నారని ఆరోపించారు. మహిళలను అగౌరవపరిచేలా సాక్షిలో వార్తలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.
జగన్‌ రెడ్డి సతీమణి వైఎస్‌ భారతి రెడ్డి సాక్షి పత్రికకు చైర్‌ పర్సన్‌ గా ఉండి సాటి మహిళలను అవమానించడం సిగ్గుచేటని అన్నారు.
తాడేపల్లి ప్యాలెస్‌ నుంచే స్కెచ్‌ :
జత్వానీ కేసులో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ జగన్‌ రెడ్డి విష ప్రచారం చేయడం అమానుషం. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గడిచిన ఐదేళ్లలో మొత్తం పోలీస్‌ వ్యవస్థనే భ్రష్టుపట్టించింది నువ్వు కాదా జగన్‌ రెడ్డి? జత్వానీ కేసులో తాడేపల్లి ప్యాలెస్‌ లోనే స్ట్రిప్ట్‌ రాసింది వాస్తవం కాదా? అంత పెద్ద సార్‌ చెప్పారని ఎఫ్‌ ఐఆర్‌ నమోదైన గంటలోనే జత్వానీని అరెస్ట్‌ చేయడానికి ముంబై ఫ్లైట్‌ ఎక్కానని సస్పెండైన విశాన్‌ గున్నీ లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణపై ఏం చెబుతావ్‌ జగన్‌ రెడ్డీ? జత్వానీని అరెస్ట్‌ చేయడానికి వెళ్లేందుకు కనీసం డీజీపీ అనుమతి కూడా తీసుకోకుండా ముంబై వెళ్లడం దేనికి సంకేతం? జత్వానీ వ్యవహారంలో పెద్దల ఆదేశాలతోనే ఐపీఎస్‌ లు ముగ్గురూ నిబంధనలకు పాతరేసింది వాస్తవం కాదా? జత్వానీ ఆమె తప్పు చేసినట్టు ఆధారాలు లేవు. అయినప్పటికీ కేసు పెట్టడానికి ముందే ముంబై టికెటక్టు బుక్‌ చేసుకున్నది వాస్తవం కాదా అని నిలదీసారు.
పారిశ్రామిక వేత్తను కాపాడేందుకు ఆమెపై ఏపీలో కేసు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడిరది ఎవరు జగన్‌ రెడ్డీ? మహిళను గదిలో నిర్బంధించి వేధించి, హింసించారు. తనకు జరిగిన ఘోరంపై తల్లితో కలిసి జెత్వానీ ఫిర్యాదు చయడంతో కేసు నమోదు చేసిన ఆ ముగ్గురు ఐపీఎస్‌ లపై ఎన్డీఏ ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేస్తే నీకు కక్షలా అనిపిస్తోందా జగన్‌ రెడ్డీ అని ప్రశ్నించారు. తరువాత సాక్షి దినపత్రికను దహనం చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార యార్లగడ్డ సుచిత్ర ,జిల్లా అధికార ప్రతినిధి మైనేని ఇందిరా ,జిల్లా అధికార ప్రతినిధి పాలపర్తి పద్మజ ,జిల్లా నాయకురాలు వాలిశెట్టి హైమావతి ,నియోజకవర్గ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ ,టౌన్‌ పార్టీ అధ్యక్షురాలు వసంత కుమారి ,జిల్లా నాయకురాలు లతిపున్నిసా ,రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శి సుంకర లక్షి ,మాజీ దుర్గ గుడి డైరెక్టర్‌ విశ్వనాథపల్లి పాపా ,కృష్ణకుమారి ఆది లక్షి ,ముంతాజ్‌,కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు .

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *