కాకినాడ, సెప్టెంబర్‌ 14: రాజకీయాల్లో జగన్‌లా ఆలోచించడం వేరేవారికి సాధ్యం కాదు. ఇదే మాట ఆయన రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు కూడా చెబుతుంటారు. చంద్రబాబు అనేక సందర్భాల్లో ఈ మాట చెప్పారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ పనైపోయిందని అంతా అనుకున్నారు. కానీ.. జగన్‌ కొత్త స్ట్రాటజీతో ముందడుగు వేస్తున్నారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌ సారధ్యంలోని వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఎవరూ ఊహించని ఫలితాల్ని వైసీపీ నేతలు చూశారు. 151 నుంచి 11 సీట్లకు వైసీపీ పడిపోయింది. దీంతో ఇక వైసీపీ పని అయిపోయింది.. ఆ పార్టీ మళ్లీ పైకి లేవడం కష్టం అని జగన్‌ రాజకీయ ప్రత్యర్థులు అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. అటు వైసీపీ నేతలు, కేడర్‌ కూడా డీలా పడ్డారు. జగన్‌ కూడా డైలామాలో ఉన్నట్టు అనేక వార్తలు, విశ్లేషణలు వినిపించాయి. ఏపీలో తాజాగా కొన్ని ఘటనలు జరిగాయి. వాటి వెనక కారణాలు ఏమున్నా.. జగన్‌ మాత్రం తన స్టైల్‌లో ముందడుగు వేశారు. ఓటమి నుంచి తేరుకొని ప్రజల్లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే మళ్లీ వైసీపీ కేడర్‌, నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నికల తర్వాత కొందరు వైసీపీ నేతలపై దాడి జరిగింది. వాటిని ఖండిరచిన జగన్‌.. వినుకొండలో జరిగిన హత్యపై స్ట్రాంగ్‌గా రియాక్ట్‌ అయ్యారు. మృతుడి కుటుబం సభ్యులను పరామర్శించేందుకు వినుకొండకు వెళ్లారు. అప్పుడు ప్రజల నుంచి ఊహించని స్పందన వచ్చిందితర్వాత జగన్‌ కడప పర్యటనకు వెళ్లారు. అక్కడ కూడా భారీ సంఖ్యలో జనం కనిపించారు. అటు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌.. ఇలా ఎక్కడికి వెళ్లినా జగన్‌ను చూడటానికి జనం భారీగా తరలివస్తున్నారు. ఇటీవల విజయవాడలో వరదలు సంభవించినప్పుడు జగన్‌ పర్యటించిన ప్రాంతంలోనూ జనాలు ఎక్కువగానే కనిపించారు. తాజాగా కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ జగన్‌ పర్యటించారు. అక్కడా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఎన్నికల సభలకు వచ్చినట్టు ప్రజలు వస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.జగన్‌ వెళ్లిన దగ్గరకు భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో.. వైసీపీకి ఊపిరి పోసినట్టు అవుతోంది. వైసీపీ కేడర్‌కు ధైర్యం వస్తోంది. ఈ నేపథ్యంలో.. చాలా మంది నేతలు ఇప్పటికే వైసీపీ గోడ దూకుదామనే ప్లాన్‌లో ఉన్నారు. అలాంటి వారు ఈ క్రేజ్‌ చూసి ఆగిపోతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక కొన్ని రోజులు జగన్‌ కూడా డైలమాలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ స్థాయిలో ఓటమి పాలయ్యాక జగన్‌ను వైసీపీని ప్రజలు పట్టించుకుంటారా అని నేతల్లో అనుమానం ఉండేది. కానీ.. తాజాగా ప్రజల నుంచి వస్తున్న స్పందన చూశాక ఆ అభిప్రాయం మారుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూశాక.. జగన్‌ కూడా కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జగన్‌ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం2019 ఎన్నికలకు ముందు జగన్‌ను చంద్రబాబు లైట్‌గా తీసుకున్నారు. దాని ఫలితం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. ఇప్పుడు కూడా కూటమికి భారీ విజయం దక్కడంతో.. జగన్‌ను లైట్‌గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోందని కొందరు టీడీపీ నేతలు చెబుతున్నారు. జగన్‌ను లైట్‌గా తీసుకుంటే.. ఇక తమ పార్టీ సంగతి అంతేనని ఓ టీడీపీ నేత వ్యాఖ్యానించారు.
పార్టీ మారే వారిని లైట్‌ గా తీసుకున్న జగన్‌
రాజకీయాల్లో జగన్‌ స్టైలు వేరు. పెద్ద పెద్ద నేతలు పార్టీని స్థాపించి అధికారం చేపట్టారు. అలాంటి నేతలు కూడా తమ పార్టీ వారు వేరే పార్టీలోకి వెళ్తుంటే దూతలను పంపి బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. కానీ.. జగన్‌ మాత్రం అలా కాదు. వెళ్లే వారిని వెళ్లనివ్వండి.. నో ప్రాబ్లం అని లైట్‌ తీసుకుంటున్నారు. లీడర్లు పోయినా పరవాలేదు.. క్యాడర్‌ తన వెంటే ఉందని జగన్‌ బలంగా నమ్ముతున్నారు. ఏ నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైనా.. తనను చూసే ప్రజలు ఓట్లు వేస్తారని జగన్‌ భావిస్తారు. అందుకే ఎంత పేరున్న నేతలు పార్టీని వీడినా.. అక్కడ ఇంకో లీడర్‌ను తయారుచేస్తానని జగన్‌ చెబుతుంటారు. అందుకే పార్టీని వీడుతున్న వారిని జగన్‌ ఆపబోరని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తాజాగా.. జగన్‌ బంధువు, పార్టీలో కీలకంగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి కూడా పార్టీని వీడటానికి సిద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాలో ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అలాంటి నేత బయటకు వెళ్తారని తెలిసినా జగన్‌ కనీసం బుజ్జగించే ప్రయత్నం చేయలేదని సమాచారం. ‘వెళ్లాలనే ఉద్దేశం ఉన్నవారు ఎప్పుడైనా వెళ్తారు.. నాకు నాతో ఉండేవారు మాత్రనే కావాలి. నాతో ఉండాలనుకునే వారు ఎప్పుడూ నాతోనే ఉంటారు’ అని జగన్‌ పార్టీ నేతలతో చెప్పినట్టు తెలిసింది.పార్టీ నుంచి ఎంత మంది నేతలు వెళ్లినా.. వెళ్తున్నా.. జగన్‌ నుంచి కొన్ని మాటలు ఎక్స్‌పెక్ట్‌ చేయలేమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ‘వద్దన్నా.. ప్లీజ్‌.. వెళ్లకండి’ వంటి మాటలు జగన్‌ డిక్షనరీలో లేవని వైసీపీ క్యాడర్‌ అంటోంది. ఇప్పుడు వెళ్లిన నేతలు మళ్లీ ఎన్నికల సమయానికి తమ పార్టీలోకే వస్తారని వైసీపీ క్యాడర్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. అలాంటి వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోవద్దని కార్యకర్తలు జగన్‌ను కోరుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *