విశాఖపట్నం:దేశంలో ఈరోజు తొమ్మిది ఎయిర్‌ పోర్టులలో డిజి యాత్ర సేవలు ప్రారంభించాం. దేశంలో 24 ఎయిర్‌ పోర్టులలో డిజి యాత్ర సేవలు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్‌ సమయంలో డిజి యాత్ర ఆలోచన జరిగిందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు.
శుక్రవారం నాడు అయన విశాఖ ఎయిర్‌ పోర్టు లో డిజి యాత్ర సేవలను ప్రారంభించారు.
కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2022 లో డి జి సేవలు ప్రారంభించారు. 3 కోట్ల మంది విమాన ప్రయాణికులు డిజి యాత్ర ను వినియోగించుకున్నారు. డిజి యాత్ర సేవలు ద్వారా ప్రయాణికులు సులబతరంగా ఎయిర్‌ పోర్టు లోకి ప్రవేశించవచ్చు. దేశంలో ఎయిర్‌ పోర్టు సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. డిజి యాత్ర యాప్‌ లో ప్రయాణికులు వివరాలు నమోదు చేసుకుంటే ఎయిర్‌ పోర్టు లో స్కానర్‌ ద్వారా ఐదు సెకండ్లులో లోపలికి వెళ్ళవచ్చు. డిజి యాత్ర యాప్‌ లో ప్రయాణికుల వివరాలు గోప్యంగా ఉంటాయి. భవిష్యత్‌ లో దేశములో ఉన్న ప్రతి ఎయిర్‌ పోర్టులలో డిజి యాత్ర సేవలో ప్రారంభిస్తాం. విమాన ప్రయాణికులు తప్పకుండా డిజి యాత్ర యాప్‌ ను డౌన్లోడ్‌ చేసుకోవాలి. అక్టోబర్‌ 27వ తేదీ నుంచి విశాఖ నుంచి విజయవాడ కు నూతన విమాన సర్వీసును ప్రారంభిస్తున్నాం. విశాఖ ఎయిర్‌ పోర్టు నుంచి ఎయిర్‌ కనెక్టివిటీ పెంచడానికి నా వంతు కృషి చేస్తాను. మరో రెండు సంవత్సరాలలో భోగాపురం ఎయిర్‌ పోర్టు అందుబాటులోకి తీసుకొస్తాం. ఎయిర్‌ పోర్టు కు రోడ్డు కనెక్టివిటీపై ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రంలో మరిన్ని ఎయిర్‌ పోర్టు తీసుకురావాలని స్థలాలు పరిశీలిస్తున్నాం. విశాఖ ఎయిర్‌ పోర్టు లో కార్గో సేవలను పెంపొందిస్తాం. ప్రజలకు మంచి సేవలు అందించడంలో పౌర విమానయాన శాఖ ముందు ఉంటుందని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *