విశాఖపట్టణం, ఆగస్టు 27: వైసీపీ అధినేత జగన్‌బాబు కష్టాలు మొదలయ్యాయా? బొత్స రూపంలో ఆ పార్టీకి మరో ఉప్పు పొంచి ఉందా? వైసీపీ రెండు గ్రూపులుగా చీలిపోయిందా? ఎందుకు జగన్ కంగారు పడుతున్నారు? అసలు వైసీపీలో ఏం జరుగుతోందన్న చర్చ ఏపీ అంతటా సాగుతోంది.2024 ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్ల వస్తాయని కలలో కూడా ఊహించలేదు ఆ పార్టీ నేతలు. ఆ షాక్ నుంచి నేతలు ఇంకా బయట పడలేదు. కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసిన సందర్భం లేదు. ఇప్పట్లో ఆ పార్టీ పుంజుకునే అవకాశాలు కనిపించలేదు. పార్టీకి వెన్నుముకగా ఉంటారను కున్న నేతలు రాం రాం చెప్పేస్తున్నారు.వైసీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికితోడు ఏడుగురు ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టాలన్నది ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకువచ్చింది. ఇదే విషయమై మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణను విూడియా అడిగితే దాన్ని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.తాను జ్యోతిష్యం చెప్పే వ్యక్తిని కాదని తప్పించుకునే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ బొత్స. విూడియా మాదిరిగా తాను స్పెక్యులేషన్ చేయలేనని, వాస్తవాలు ఏమైనా ఉంటేనే పార్టీలో మాట్లాడుకుంటామని చెప్పి ఇష్యూ నుంచి డైవర్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. బొత్సకు పార్టీ ప్రయార్టీ ఇవ్వడాన్ని చాలామంది నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట.వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు ఓ గ్రూప్‌గా ఏర్పడి పార్టీని కూటమిలో కలిపేందుకు ఆలోచన చేస్తున్నారట. ఈ విషయంలో టీడీపీ నోరు ఎత్తులేదు. జనసేన, బీజేపీ వైపు ఆయా నేతలు చూస్తున్నారని తెలుస్తోంది. తమ కు అసెంబ్లీలో మాట్లాడే అవకాశంలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉండేబదులు మరో పార్టీకి జంప్ అయితే బెటరని అనుకుంటున్నారు.గతంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను అలాగే చేయాలని వైసీపీ భావించింది. ఆ పార్టీని నేతలు వీడలేకపోవడంతో ఆ ప్లాన్ బూమరాంగ్ అయ్యింది. ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతే వైసీపీ పనైపోయినట్టేనని అనుకుంటున్నారు టీడీపీ నేతలు. ఇలాంటి తలనొప్పులు భరించలేక తాడేపల్లి వదలి యలహంక ప్యాలెస్‌కి వెళ్లారని అంటున్నారు. మరి ఎమ్మెల్యేల వ్యవహారం బడ్జెట్ సమావేశాల్లో కొలిక్కి వస్తుందని అంటున్నారు.