కడప, జూన్‌ 10: వైఎస్‌ షర్మిల.. రాజన్న బిడ్డనంటూ జనంలోకి వచ్చారు. అయితే జనం నుంచి మాత్రం ఆదరణ పొందలేకపోయారు. తనతో పాటు తన కుటుంబ పరువును పోగొట్టారు. వైఎస్‌ కుటుంబ సభ్యులకు ఓటమే తెలియని కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయి నవ్వుల పాలయ్యారు. ఆమె ఈ ఎన్నికను ఈజీగా తీసుకోవచ్చు కానీ.. కడప చరిత్రలో ఆమె కుటుంబ చరిత్రకు ఒక రెడ్‌ మార్క్‌ ను పెట్టేశారనే అనాలి. గెలుస్తానన్న విశ్వాసమో.. లేక అతి విశ్వాసమో తెలియదు కానీ కడప పార్లమెంటు నియోజకవర్గం ఎంచుకుని పీసీసీ చీఫ్‌ గా ఉండి ఓటమి పాలు కావడంతో పాటు ఒక్క స్థానంలోనూ గెలవకపోవడంతో ఆమె మరో హిస్టరీకి కుటుంబ పరంగా క్రియేట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో జరిగిన 175 స్థానాలు, పార్లమెంటు నియోజకవర్గాల్లో 5,80,613 ఓట్లు వచ్చాయి. కేవలం 1.72 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే పీసీసీ చీఫ్‌ గా వైఎస్‌ షర్మిల ఉన్న పార్టీకి కేవలం అంత తక్కువ స్థాయిలో ఓట్లు రావడం అంటే.. ఆ పార్టీకి ఇక సవిూపంలో రాజకీయ భవిష్యత్‌ లేదనే చెప్పాలి. ఒకవేళ వైసీపీ అతి తక్కువ స్థానాలు రావడంతో జగన్‌ పై వ్యతిరేకతతో కాంగ్రెస్‌ వైపు చూడాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఓట్ల షేర్‌ చూసి ఎవరూ ఆ పార్టీలోకి వచ్చి చేతులు కాల్చుకునే పరిస్థితిని కొని తెచ్చుకోలేరు. అందుకే రానున్న కాలంలో వైఎస్‌ షర్మిలకు పీసీసీ చీఫ్‌ గా పర్యటన చేయాలన్నా, ప్రజల్లోకి వెళ్లాలన్నా ఏం చెప్పుకుని వెళతారన్న ప్రశ్న వెంటనే వస్తుంది. అయితే వైఎస్‌ షర్మిల ఒకటైతే సాధించగలిగారు. తన సొంత సోదరుడు వైఎస్‌ జగన్‌ పై పగ తీర్చుకోగలిగారు. కొన్ని చోట్ల ముస్లిం ఓట్లకు గండి కొట్టడంతో జగన్‌ పార్టీకి నష్టం చేకూర్చారు. వైఎస్‌ జగన్‌ పైనా విమర్శలు చేయడంలో ముందున్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ జగన్‌ ను దోషిగా చూపిస్తూ రాష్ట్రమంతటా పర్యటిస్తూ కొంత వరకూ జగన్‌ ను డ్యామేజీ చేయగలిగారు. జగన్‌ కు సొంత ఇంట్లోనే శత్రువులున్నారని ప్రజలు అనుకునేలా చేశారు. ఇది ఒకరకంగా మహిళ ఓటర్లపై కూడా పడిరదన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. రాయలసీమలో ఎక్కువగా ముస్లిం, రెడ్డి సామాజికవర్గం ఓటర్లకు గండి కొట్టడంలో సక్సెస్‌ కాగలిగారు. కడప, జమ్మలమడుగు వంటి వైసీపీకి బలమైన నియోజకవర్గాలు వైసీపీ కోల్పోయిందంటే అందుకు వైఎస్‌ షర్మిల కూడా కారణమని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. ఎందుకంటే అక్కడ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య బాగా పనిచేసిందని అంటున్నారు. కడప పార్లమెంటులో అవినాష్‌ రెడ్డి గెలిచినా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమికి ఇది ఒక కారణమని చెబుతున్నారు.తొలుత తెలంగాణలో పార్టీనిపెట్టి తర్వాత అక్కడికే పరిమితం అవుతారనుకుంటే.. జగన్‌ ను అరెస్ట్‌ చేయించిన పార్టీకి అధిపతిగా మారారు. అంతేకాదు.. ఎన్నికల ప్రచారంలో చివరి సమయంలో రాహుల్‌ గాంధీని కడపకు రప్పించంతో అక్కడ జగన్‌ పార్టీ ఓట్లకు భారీగా డ్యామేజీ అయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇంతకీ వైఎస్‌ షర్మిల సాధించిందేమిటి అంటే ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకదు. అన్న జగన్‌ ఓటమికి ఒక కారణంగా మాత్రం ఆమె ఈ ఎన్నికల్లో పనిచేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఆమెకు ప్రత్యేకంగా ఒరిగిందేవిూ లేదు. కానీ అన్నపై పగ చల్లారిందా? లేక కొనసాగుతుందా? అన్నది పక్కన పెడితే తాను ఓడిపోయి.. సోదరుడిని ఓడిరచి..తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరుకు, ప్రతిష్టకు చెడ్డపేరు తెచ్చారన్న అప్రదిష్టను మాత్రం మూటగట్టుకున్నారు. అదీ షర్మిల సాధించింది. అంతకు మించి మరొకటి లేదు.
తిరుగుబాటు తప్పదా…
కడప జిల్లా ప్రజలు మనసు మార్చేందుకు షర్మిల చేయని ప్రయత్నం అంటూ లేదు.కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె జిల్లా ప్రజలకు ఎన్నో రకాలుగా వినతులు ఇచ్చారు.ఆ మహానేత బిడ్డగా కొంగుచాచి అడుగుతున్నాను ఓటు వేయండి అని కోరారు.ఆమె తరుపున వివేక భార్య, కుమార్తె సైతం ప్రచారం చేశారు. వివేకానంద రెడ్డి ని హత్య చేసిన వారికి అండగా నిలబడతారో? బాధితులకు అండగా నిలబడతారో? తేల్చుకోవాలని జిల్లా ప్రజలను కోరారు.అయితే ప్రజలు మాత్రంఆమె మాటను విశ్వసించారు కానీ.ఆమెను ఆదరించలేదు. కూటమి వైపు మొగ్గు చూపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపారు. 10 సీట్లకు గాను ఏడు చోట్ల కూటమి అభ్యర్థులను గెలిపించారు. కానీ పార్లమెంట్‌ స్థానానికి వచ్చేసరికి త్రిముఖ పోటీలో అవినాష్‌ రెడ్డి ని గెలిపించారు. వైసిపి అసెంబ్లీ అభ్యర్థులు గెలవడం ద్వారా షర్మిల లక్ష్యం నెరవేరినా.. ఎంపీగా అవినాష్‌ రెడ్డి గెలుపు మాత్రం షర్మిలకు రుచించని విషయం.అయితే ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్‌ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. కేవలం జగన్‌ ను దెబ్బతీయాలని షర్మిల చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆ విషయంలో మాత్రం ఆమె సక్సెస్‌ అయ్యారు. కానీ కాంగ్రెస్‌ పార్టీని లైమ్‌ లైట్లో తీసుకురావడంలో మాత్రం ఫైలయ్యారు. నిన్నటి వరకు ఆమె కాంగ్రెస్‌ పార్టీకి ఆశాదీపం అవుతారని భావించిన వారు నీరుగారిపోయారు. పార్టీలో సైతం ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణ ఇప్పుడు బయటకు వచ్చింది. విజయవాడ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్న సుంకర పద్మశ్రీ తాజాగా విూడియా ముందుకు వచ్చారు. షర్మిలపై ఆరోపణలు చేశారు. ఆమెతో కాంగ్రెస్‌ పార్టీకి ఎటువంటి లాభం లేదని.. టిక్కెట్లు సైతం అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో సైతం షర్మిలపై తిరుగుబాటు ప్రారంభం అయినట్టు కనిపిస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *