మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
అమరావతి జూన్‌ 6: తెలుగుదేశం పార్టీ దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భయానక వాతావరణం నెలకొందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయన్నారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.‘రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ విూడియా సైనికులకు తోడుగా ఉంటాం’ అని జగన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.కాగా, మంగళవారం వెలువడిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇక తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో అఖండ విజయంతో అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ? జనసేన ? బీజేపీ కూటమి ఏకంగా 164 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ఓటమిని అంగీకరిస్తూ జగన్‌ సీఎం పదవికి రాజీనామా చేసేశారు. ఇక ఈనెల 12న రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *