అమరావతి జూన్‌ 4: దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన లీడర్‌. ఓ విజన్‌ ఉన్న నాయకుడు. అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లే చంద్రబాబు సీఎం కావాలని ఏపీ ప్రజలు సంకల్పించుకున్నారు. 2014లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ప్రజాపాలన అందించడంలో విఫలమైంది. ప్రతిపక్షనేత చంద్రబాబుపై కక్షకట్టింది. ప్రతి అంశంలోనూ చంద్రబాబును ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ అరాచకాలకు విసుగుచెందిన చంద్రబాబు.. తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించడంతో చంద్రబాబు శపథం నెరవేరింది. చంద్రబాబు నాయుడు సీఎంగానే అసెంబ్లీకి వస్తానంటూ శపథం చేసిన సమయంలో ఎంతోమంది ఎగతాళి చేశారు. చంద్రబాబు మరోసారి సీఎం అయ్యే అవకాశం లేదంటూ హేళన చేశారు. వాటన్నింటిని టీడీపీ అధినేత పట్టించుకోలేదు. ప్రజలనే నమ్ముకుని.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. బాబుపై విశ్వాసం ఉంచిన ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం కూటమిని అధికారంలోకి తీసుకువచ్చారు.
జైల్లోపెట్టినా..
తనకు సంబంధంలేని కేసుల్లో ఇరికించి చంద్రబాబును జగన్‌ జైల్లో పెట్టించినా కుంగిపోలేదు. ప్రజలపై విశ్వాసంతో ముందుకెళ్లారు. కేసులకు బెదిరిపోనని.. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేయలేదు.
ఎన్నో ఇబ్బందులు..
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని వైసీపీ నాయకులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు ప్రయత్నించినప్పుడల్లా.. వైసీపీ ఎమ్మెల్యేలు హేళనచేస్తూ మాట్లాడేవాళ్లు. తమకు మెజార్టీ ఉందనే అహంకారంతో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించారు. సీఎం స్థాయిలో జగన్‌ ప్రతిపక్షనేతకు తగిన గౌరవం ఇవ్వలేదు. అయినప్పటికీ అన్ని అవమానాలను భరించిన చంద్రబాబు.. 2024లో సీఎంగా అసెంబ్లీలో అడుగుపెడతానంటూ సవాలు విసిరారు. శపథానికి తగినట్లు ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి 150కి పైగా సీట్లలో విజయం సాధించింది

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *