ప్రపంచ మానవాళి లో పోషకాహార ప్రధాన వనరుగా పాల కు ప్రత్యేక స్థానం ఉంది. పాలు లేకపోతే ప్రపంచం ముందుకు నడవదు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. పాడి రంగాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రపంచ పాల ఉత్పత్తుల ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియ చేయడానికి ఐక్యరాజ్యసమితికి సంబంధించిన ఆహార వ్యవసాయ సంస్థ ప్రతి సంవత్సరం జూన్‌ 1 న ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. పాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ పాల దినోత్సవం ఏర్పాటుచేయబడిరది.100 శాతం పోషక విలువలు, విటమిన్‌ బి12 అధికంగా కలిగిన ఆహారమైన పాలు, టీనేజి పిల్లల్లో, విద్యార్థుల్లో, మానసిక, శారీక ఉత్సాహాన్ని, పెరుగుదలను, ఎముకల పటుత్వాన్ని కలిగిస్తాయి. రానురాను వాతావరణ సమతుల్యం లోపం వలన వర్షాలు సరిగ్గా పడక, మేత దొరకక పశుపోషణ కష్టమైంది. దీంతో పాల ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఈ పాలను మంచి వ్యాపార వస్తువుగా మలచుకొని అనేక డైరీలు వెలిశాయి. అయితే డైరీల్లో పాలు నిల్వవుండేందుకు అనేక రకాల రసాయనాలు కలుపుతున్నారు. వీటి వల్ల పాలల్లో పోషకాల సంఖ్య తగ్గిపోతోంది. పాల ఉత్పత్తులో ప్రపంచంలో మనదేశం అగ్రభాగాన ఉన్నా, వినియోగంలో మాత్రం పూర్తిగా వెనుకబడ్డాం. ఈ ప్రమాదాన్ని గుర్తించి 2001 జూన్‌ 1 నుండి ఫుడ్‌, అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ వారు పాలను సంపూర్ణ ఆహారంగా మార్చారు. కల్తీ లేకుంటే పాలకు మించిన పోషకాహారం లేదు. కల్తీ జరగకుండా ప్రభుత్వమే నిరంతర పర్యవేక్షణ చేయాలి. చిన్న పెద్ద డైరీలు సహకార సంఘాలు నష్టాల బారిన పడకుండా చూడాలి.?

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *