జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి
గ్రూప్‌ `1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సవిూక్ష,
కరీంనగర్‌: టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జూన్‌ 9న జరగనున్న గ్రూప్‌`1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. చిన్న మిస్టేక్‌ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ తో కలిసి సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ లో 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 34 ప్రైవేట్‌ విద్యాసంస్థలు, రెండు ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో 18,663 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు, ఫ్యాన్లు, లైట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా గట్టి నిఘా మధ్య పరీక్ష ప్రశాంతంగా పారదర్శకంగా సాగేలా చూడాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు కల్పించాలని, అభ్యర్థులను తనిఖీ చేసిన తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని పేర్కొన్నారు. బయోమెట్రిక్‌ హాజరు విధానం ఉంటుందని, అభ్యర్థులు జూన్‌ 9న ఉదయం 9 గంటలకు, ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 10 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారని తెలిపారు. ఆ తర్వాత వచ్చే వారిని అనుమతించారని పేర్కొన్నారు. పరీక్ష ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని తెలిపారు. టీజీపీఎస్సీ రూపొందించిన నిబంధనలను అభ్యర్థులు పాటించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్ష జరిగే సమయంలో విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలుగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఒక్కో పరీక్ష కేంద్రం వద్ద వైద్య సిబ్బంది మందులతో అందుబాటులో ఉండాలని సూచించారు. ఓఎంఆర్‌ షీట్లు, ప్రశ్నపత్రాలను గట్టి భద్రత మధ్య స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరచాలని పేర్కొన్నారు. పరీక్ష జరిగే రోజున ఉదయమే ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రాలకు తగిన పోలీస్‌ భద్రత మధ్య తీసుకెళ్లాలని తెలిపారు. పరీక్ష ముగిసిన తర్వాత అభ్యర్థుల హాజరు, ఓఎంఆర్‌ షీట్ల సంఖ్యను సరిగా చూసుకోవాలని సూచించారు. ఏమైనా తేడాలు వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆయా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అలాగే ఎక్కడ ట్రాఫిక్‌ కు అంతరాయం కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులు వచ్చేటప్పుడు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకొని రావాలని తెలిపారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో సిబ్బంది కదలికలపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్ష రోజున కేంద్రంలో ఎంతమంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారో లిస్టు తయారు చేయాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం ఇవ్వవద్దని, అధికారులంతా అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళరాదని, ఇన్విజిలేటర్లు సైతం సెల్‌ ఫోన్లను తీసుకు వెళ్ళవద్దని తెలిపారు. టీజీపీఎస్సీ నిబంధనల మేరకు అధికారులు విధులు నిర్వర్తించాలని సూచించారు. పరీక్ష ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, డీఆర్‌ఓ పవన్‌ కుమార్‌, ఆర్డీవో కే మహేశ్వర్‌, అడిషనల్‌ డీసీపీ జే కుమార్‌, కొండగట్టు జేఎన్టీయూ కళాశాల ప్రొఫెసర్‌ బీ సతీష్‌ కుమార్‌, కలెక్టరేట్‌ సూపరిండెంట్‌ కాలీ చరణ్‌, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ టీ శ్రీలక్ష్మి, మాస్‌ విూడియా అధికారి రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *