హైదరాబాద్: ప్రతి సంవత్సరం మహిళలకు దసరా కానుకగా తెలం గాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ నేటి నుంచి ప్రారంభం కానుంది.మేడ్చల్ మల్కాజిగిరి వ్యాప్తం గా చీరల పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్నారు. సంబంధిత కేంద్రాలకు చీరలను తరలించారు. బుధవారం నుంచి లబ్ధిదారులు ధ్రువీకరణ పత్రాల ను చూపి దసరా కానుక అందుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా 4.40 లక్షల చీరలు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఐదు నియోజకవర్గాలలో మొత్తం నాలుగు లక్షల 40 వేల చీరలను లబ్ధిదారులకు పంచనున్నారు.జిల్లా వ్యాప్తంగా 7,24,950 మంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ వారిలో 4.40 లక్షల మందికి చీరలు అందివ్వనున్నారు. కీసర, మేడ్చల్ రూరల్, ఎంసిపల్లి, మీర్‌పేట్, జవహర్ నగర్ దమ్మాయిగూడ, నాగారం తూముకుంట అల్వాల్, మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో 1,40,893 చీరలను కేటాయించారు.ఘట్కేసర్ రూరల్, మల్కాజిగిరి, పోచారం, పిర్జాదిగూడ, బోడుప్పల్, ఉప్పల్, నాగోలు, ఘట్కేసర్ మున్సిపాలిటీ, కాప్రా పరి ధిలో 1,32, 150 మంది లబ్ధిదారులకు, నిజాంపేట్, దుండిగ ల్, గండి మైసమ్మ, కొంపల్లి, గాజులరామారం, కూకట్‌పల్లి, మూసాపేట, గుండ్ల పోచంపల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 2,02,956 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు.జిల్లాలో ఉన్న శామీర్ పేటలో ఉన్న మండల మహిళా సమాఖ్య భవనం, ఉప్పల్ లోని గాంధీనగర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, గాజులరామారం సర్కిల్ భగత్ సింగ్ నగర్ కమ్యూనిటీ హాల్ ఆయా ప్రాంతాలకు చీరలను తరలించారు.జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ సర్కిళ్లలోని 27 ప్రాంతా లున్నాయి. వీటిలో అత్యధికంగా మూ సాపేట సర్కిల్ పరిధిలో 78,881 మంది లబ్ధిదారులు ఉండగా వారిలో 47,881 మది లబ్ధిదారులకు బతు కమ్మ చీరలను కేటాయించారు.జిల్లా వ్యాప్తంగా ఈ సర్కిళ్లలోని అత్యధిక లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తుంది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి లో 4,154 మంది లబ్ధిదారులు ఉండ గా వీరిలో 2,540 మంది లబ్ధిదారులకు బతుకమ్మ కానుకను ఇవ్వనున్నా రు. జిల్లాలో గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని తక్కువ లబ్ధి దారులు ఉన్నట్లు చెబుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *