విజయవాడ, మే 18: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఓటరు దేవుళ్లు మాత్రం ఎవరిని కనికరించారు అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఓటర్లు ఎక్కవ శాతం ఓటు వెయ్యడంతో టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులు వారి విజయంపై అంచనా వెయ్యలేకపోతున్నారు. ఐదు సంవత్సరాలుగా అధికారానికి దూరం అయిన టీడీపీ నాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు మరోసారి అధికారంలోకి వచ్చి వాళ్లు అనుకున్న పనులు చెయ్యాలని అనుకుంటున్నారు. ఎవ్వరు ఎన్ని అనుకున్నా ఓటర్లు మాత్రం ఇప్పటికే తీర్పు ఇచ్చేయడంతో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన నాయకుల అందరి జాతకాలు ఈవీఎంలో భద్రంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ మంత్రుల జాతకాలు తల్లకిందులు అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ లోని మంత్రులు, ఎమ్మెల్యేలు జాతకాలు మారిపోతుండటంతో వారిలో ఇప్పటికే గుబులు మొదలైయ్యిందని తెలిసింది. అలాగే ఇంతకాలం ప్రతిపక్షానికి పరిమితం అయిన టీడీపీ నాయకులు ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని అనేక ప్రయత్నాలు చేశారని ఇప్పటికే స్పష్టంగా వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ, జనసేనకు చావో బతుకో అనే పరిస్థితి వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఐదు సంవత్సరాలు పాటు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు ఇప్పుడు ఒక్కసారిగా అధికారం దూరం అయితే సహించలేక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. అలాగే ఇప్పుడు అధికారంలోకి రాకపోతే మరో ఐదు సంవత్సరాల పాటు నానా తిప్పలు పడాల్సి వస్తుందని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం విూద ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో ? అని టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు చాలా టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఓటు వేసి అన్ని పార్టీల నాయకుల జాతకాలు ఈవీఎంల్లో భద్రపరిచిన ప్రజలు మాత్రం ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు, వారి అనుచరులు, ఓటర్లు కూల్ గానే ఉన్నా మధ్యలో పలు పార్టీల కోసం పని చేసి అందరిలో గుర్తింపు తెచ్చుకున్న కార్యకర్తలకు మాత్రం ఇప్పుడు టెన్షన్ మొదలైయ్యింది.