న్యూయార్క్‌ మే 16: హబుల్‌ టెలిస్కోప్‌కు ఆకాశ అద్భుతం చిక్కింది. విరజిమ్ముతున్న నెబులా నుంచి త్రి నక్షత్ర కూటమి ఉద్భవించింది. ఆ హెచ్‌పీ టావూ ఫ్యామిలీలో ఓ యువ నక్షత్రం కూడా ఉన్నట్లు నాసా పేర్కొన్నది. సుమారు 550 కాంతి సంవత్సరాల దూరంలో ఆ నక్షత్రం జన్మించినట్లు నాసా వెల్లడిరచింది. హెచ్‌పీ టావూ నక్షత్ర కుటుంబంలో హెచ్‌పీ టావూ, హెచ్‌పీ టావూ జీ2, హెచ్‌పీ టావూ జీ3 నక్షత్రాలు ఉన్నాయి. ఈ మూడిరటిలో మిళమిళలాడుతున్న హెచ్‌పీ టావూ చాలా చిన్న వయసున్న నక్షత్రం. సూర్యుడి తరహాలో ఉద్భవిస్తున్న ఈ నక్షత్రం వయసు 10 మిలియన్ల సంవత్సరాలు ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మన సూర్యుడి సుమారు 4.6 బిలియన్ల ఏళ్ల క్రితం పుట్టిన విషయం తెలిసిందే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *