హైదరాబాద్‌, మే3: తెలంగాణలో గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ పరీక్షను ఆఫ్‌లైన్‌ విధానంలోనే నిర్వహించనున్నట్లు మే 1న ఒక ప్రకటనలో తెలిపింది. ప్రిలిమ్స్‌ పరీక్షను ఓఎంఆర్‌(ూఓఖీ) విధానంలోనే నిర్వహించనున్నట్లు ుూఖూఅ స్పష్టం చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్‌ 9న గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ పరీక్షను, అక్టోబర్‌ 21న మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీస్సీ ఇప్పటికే వెల్లడిరచింది. పరీక్షలకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతారు. పరీక్ష సమయానికి 4 గంటల ముందువరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. తెలంగాణలో గ్రూప్‌`1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 563 పోస్టుల భర్తీకీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఫిబ్రవరి 19న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. గ్రూప్‌`1 పరీక్ష కోసం మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 2 సంవత్సరాలకు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో గరిష్ఠవయోపరిమితి 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు చేరింది. అయితే నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తించనున్నాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్‌`సర్వీ?స్‌మెన్‌ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ`ఎస్టీ`బీసీ`ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు ప్రిలిమ్స్‌ పరీక్ష (జనరల్‌ స్టడీస్‌ డ మెంటల్‌ ఎబిలిటీ), 900 మార్కులకు మెయిన్‌ (6 పేపర్లు) పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి. ఇక మెయిన్‌ పరీక్షలో 150 మార్కులకు జనరల్‌ ఇంగ్లిష్‌ అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: ఆసిఫాబాద్‌`కొమ్రంభీమ్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, సిరిసిల్ల`రాజన్న, సిద్ధిపేట, మెదక్‌, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి`యాదాద్రి, జనగాం, మేడ్చల్‌`మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగుళాంబ`గద్వాల్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌.
మెయిన్‌ పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, హైదరాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *