కినాడ, ఏప్రిల్ 30:రాష్ట్రం చంద్రబాబు తాత జాగీరు కాదని కాపు ఉద్యమ నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ కు విషయం విూద అవగాహన లేక.. తెలుసుకోవడానికి ఖాళీ లేక పవన్ మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘తుని రైలు దహనం జరిగినప్పుడు నీ పక్కన ఉన్న నెహ్రు వైసీపీ లొనే ఉన్నాడు తెలుసుకోవాలి. తుని రైలు సంఘటనకి చంద్రబాబే కారణం. అది పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. నన్ను తీహార్ జైలుకి పంపించాలని చంద్రబాబు ప్రయత్నం చేశాడు. నేను చవటను దద్దమ్మను.. మరి కాపుల కోసం నువ్వు ఎందుకు రోడ్డు ఎక్కలేదు. పవన్ కళ్యాణ్ నాపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. వైసీపీ కాపు ఎమ్మెల్యేలను తిట్టడానికి పవన్ కి హక్కు ఏంటి? ఉద్యమానికి ఎప్పుడు మద్దతు ఎందుకు ఇవ్వలేదు?’’ అని ముద్రగడ మాట్లాడారు.పవన్ ను పిఠాపురంలో నేను ఓడిరచకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చాడు. అసలు పవన్ కళ్యాణ్ అడ్రెస్ ఏంటి? ఎక్కడ పుట్టాడు? తెలంగాణలో విూరు పెట్టిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు కదా? సినిమాలలో నటించండి.. రాజకీయాలలో కాదు. నీ పార్టీ త్వరలో ప్యాకప్ అవుతుంది. పిఠాపురంలో నిన్ను తన్ని తరిమేస్తారు. సినిమా వాళ్ళు ఎప్పుడైనా ప్రజలను అక్కున చేర్చుకున్నారా?ఉప్మా, కాఫీ అని నన్ను పవన్ అవమానిస్తున్నాడు. గౌరవం చేయడం మా అలవాటు. సిగ్గు లేదా అలా అనడానికి? నీ ఇంట్లో ఎప్పుడైనా ఎవరికి అయినా కనీసం కాపీ ఇచ్చారా? 1978లో చంద్రబాబు నేను ఒకేసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళాం. 78లో చంద్రబాబు శిథిలమైన పెంకుటిల్లుకు మరమ్మతులు చేయించడానికి కూడా విూకు డబ్బులు లేవు కదా ఆ సంగతి మర్చిపోయారా.అప్పుడున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న పరిస్థితి.. విూకు అప్పుడున్న ఆస్తులు ఎంత ఇప్పుడున్న ఆస్తులు ఎంత? వివరాలు తెలియజేయగలరని ముద్రగడ చంద్రబాబుకు సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే నా పేరు మార్చుకుంటా అని ముద్రగడ పవన్ కళ్యాణ్ కి సవాల్ చేశారు. ఈ విూడియా సమావేశంలో ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు, గౌతు స్వామి, గణేశుల లచ్చబాబు, గోపు చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.