కాకినాడ, ఏప్రిల్‌ 23: జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఇదివరకే ర్యాలీగా బయలుదేరిన పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టీడీపీ ఇంచార్జి వర్మతో పాటు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ లో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు జనసేనాని తెలిపారు. గత 5 ఏళ్లలో పవన్‌ కళ్యాణ్‌ సంపాదన రూ.114.76,78,300 (నూట పద్నాలుగు కోట్ల 76 లక్షల 78 వేల 3 వందల రూపాయలు)గా ఉంది. తన సంపాదనకు సంబంధించి ఆదాయ పన్నుగా రూ.47,07,32,875 (47 కోట్ల 7 లక్షల 32 వేల 8 వందల డెబ్భై ఐదు రూపాయాలు), జీఎస్టీ రూపంలో మరో రూ.28,84,70,000 (28 కోట్ల 84 లక్షల 70 వేల రూపాయలు) పవన్‌ కళ్యాణ్‌ చెల్లించారు.
పవన్‌ కళ్యాణ్‌ అప్పులు
ఎన్నికల అఫిడవిట్‌ లో పవన్‌ కళ్యాణ్‌ తన అప్పుల గురించి వెల్లడిరచారు. పవన్‌ కళ్యాణ్‌ కు ఓవరాల్‌ గా అప్పులు రూ.64,26,84,453 (64 కోట్ల 26 లక్షల 84 వేల 4 వందల 53 రూపాయలు) ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453 (17 కోట్ల 56 లక్షల 84 వేల 4 వందల యాభై మూడు రూపాయలు) అప్పుగా తీసుకున్నారు. వ్యక్తుల నుంచి పవన్‌ కళ్యాణ్‌ తీసుకున్న అప్పులు రూ.46,70,000 (46 లక్షల 70 వేల రూపాయలు) ఉన్నాయి.
విరాళాలు రూ.20 కోట్లుపైనే
పవన్‌ కళ్యాణ్‌ వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు అందించారు. ఇందులో జనసేనకు రూ.17,15,00,000 ఉన్నాయి. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాలలో విరాళాలు ఇచ్చారు.
వివిధ సంస్థలకు రూ.3,32,11,717 (రూ.3 కోట్ల 32 లక్షలు) విరాళాలు అందచేశారు. ఆ వివరాలివి..
` కేంద్రీయ సైనిక్‌ బోర్డు ` రూ.1 కోటి
` పి.ఎం. సిటిజెన్‌ ఆసిస్టెన్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఫండ్‌ ? రూ.1 కోటి
` ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి ? రూ.50 లక్షలు
` తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి ? రూ.50 లక్షలు
` శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ ? రూ.30,11,717
` పవన్‌ కళ్యాణ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ ఎక్స్‌ లెన్స్‌ ? రూ.2 లక్షలు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *