స్వార్థ రాజకీయాల కోసం
బడుగు బలహీనులను బలి పశువులు చేస్తున్న ముఖ్యమంత్రి!!
* పోలీసుల అదుపులో ఉన్న వడ్డెర యువకులను తక్షణ విడుదల చేయాలి.
* గులకరాయి డ్రామాలు ఆపాలని ప్రజా సంఘాల డిమాండ్
* వడ్డెర యువకులను విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

రాయచోటి 17 ఏప్రిల్ 2024: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం కోడి కత్తి డ్రామాలు తలపించే విధంగా గులకరాయి డ్రామాలు ఆడుతున్నాడని పోలీసుల అక్రమంగా అదుపులోకి తీసుకున్న వడ్డెర యువకులను తక్షణ విడుదల చేయాలని అన్నమయ్య జిల్లా ప్రజాసంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. బుధవారం సాయంత్రం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గులకరాయి డ్రామాకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఓ. పి .డి .ఆర్. రాష్ట్ర సహాయ కార్యదర్శి టి ఈశ్వర్, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డయ్య ,ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ వడ్డెర కులానికి చెందిన సతీష్ తోపాటు మరికొంతమంది నీ పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేస్తూ బలవంతంగా చెయ్యని నేరాన్ని ఒప్పిస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని వారిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మైనర్లు అయిన వడ్డెర పిల్లలకు ముఖ్యమంత్రి స్థాయి జగన్మోహన్ రెడ్డి పై కక్షగట్టి గులకరా విసరాల్సిన అవసరం ఏమిటని వారు ప్రశ్నించారు . అప్పులు కుప్పలు చేసి ప్రజలకు బిస్కెట్లు వేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి అభివృద్ధి మాటలు మరిచిపోయిన ముఖ్యమంత్రి సానుభూతి డ్రామాలతో అధికారంలోకి రావాలని చూస్తున్నాడని అందులో భాగంగానే గులకరాయి డ్రామా ఆడుతున్నాడని వారు విమర్శించారు. మాఫియాలకు అడ్డాగా మార్చి రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని అడ్డదారుల్లో సానుభూతి పొందాలని వారు విమర్శించారు. 2019లో కోడి కత్తి శీను ను బలి చేసి ఐదు సంవత్సరాలు పాటు బెయిల్ రాకుండా చేసి క్షమించడానికి నేరం చేశాడని ఇప్పుడు మళ్లీ గులకరాయి డ్రామాలు ఆడుతూ అమాయకులైన వడ్డెర యువకులను బలి చేయాలని చూస్తున్నాడని ఈ రకమైన చర్యలను రాష్ట్ర ప్రజలు క్షమించాలని వారు హెచ్చరించారు . నేరంతో ఎలాంటి సంబంధం లేని అమాయకులైన వడ్డెర యువకులను తక్షణ విడుదల చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉదయం చేపట్టవలసి వస్తుందని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాయచోటి బార్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి డి. నాగముని, ఏపీవడ్డెర విద్యావంతుల వేదిక నాయకులు జీవానందం, చంద్రశేఖర్ మారుతి రజక సంఘం నాయకులు రమేష్ శ్రీనివాసులు కుంచపు రెడ్డయ్య రామకృష్ణ ,దేవరాజులు పల్లపు శీను, పామయ్య కురపోతుల రెడ్డప్ప

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *