ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలి:ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి వినతి పత్రం
నంద్యాల:ఆత్మకూరు పట్టణంలోని సిహెచ్ సిని వంద పడకల ఆసుపత్రిగా మార్చి మౌలిక సదుపాయాలు కల్పించి హాస్పటల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. యేసు రత్నం, పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్, లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా30 పడకల హాస్పటల్ ప్రారంభోత్సవం సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో హాస్పటల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ఎక్స్రే రె సౌకర్యం అందుబాటులో తేవాలని పేషంట్లకు ప్రజానీకానికి తాగునీటి కొరకు ఆర్ వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, రాజధానికి వెళ్ళే దారిలో మధ్యలో ఉన్న ఆత్మకూరు సి.హెచ్ సి పేరుకే ఉంది కానీ అందులో సరైన సౌకర్యాలు లేవు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నారు. ఆసుపత్రి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఓపి పెరిగింది కానీ అందుకు కర్నూల్ టు గుంటూరు రోడ్డులో ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్సు సౌకర్యం లేదు, ఎక్స్ రే సౌకర్యం లేదు, ,బ్లడ్ బ్యాంకు లేదు, హాస్పిటల్స్ కి వచ్చే పేషెంట్లు ప్రజలు తాగడానికి మంచినీటి సౌకర్యం లేదు, పూర్తిస్థాయిలో రక్త పరీక్షలు చేయడం లేదు ప్రజలు ఇప్పుడు ఇప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో ఏదైనా హెల్త్ సరిగ్గా లేక వైద్యం చేయించుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో వేల రూపాయలు ఖర్చు చేసుకుంటూ వారి కుటుంబాలు పలు ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు. స్పందించి ఆత్మకూరు సి హెచ్ సి లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తామని హాస్పటల్లో వంద పడకల ఆసుపత్రిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి త్వరగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకులు ఏ సురేంద్ర, డి రామ్ నాయక్, వీరన్న, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.