హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4: దేశంలో వారసత్వ రాజకీయాలు ఇప్పటివి కావు. దాదాపు అర్థ శతాబ్ది క్రితం నుంచే కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఎందరో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే వారసత్వాన్ని కొనసాగించినంత మాత్రాన అందరూ పదవుల్లో రాణించలేరు. స్వయం ప్రతిభ ఉంటే తప్ప రాజకీయ చదరంగంలో నిచ్చెనలు ఎక్కలేరు. సుదీర్ఘ కాలం మనలేరు. స్వయం ప్రతిభలేని చాలామంది రాజకీయాల్లోకి వచ్చిన కొద్ధి కాలానికే తెరమరుగైన ఉదంతాలు ఉన్నాయి. సీఎం పీఠాలు అధిష్టించిన కొడుకుల సంగతి పక్కన పెడితే.. కుమార్తెలు కూడా తండ్రి వారసత్వాన్ని అందుకొని పార్టీ అందలం ఎక్కారు. భారత రాజకీయాల్లో అటువంటి ఉదంతం ఒకటి ఉంది. జమ్మూ కశ్మిర్లో వారసత్వంగా మెహబూబ్‌ ముఫ్తి సీఎం అయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో ఇపుడు తండ్రి, కూతుళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీళ్లంతా బిఆర్‌ ఎస్‌ ముఖ్య నేతలు, వారి కూతుళ్లే కావడం గమనార్హం.మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్‌ తనయ, గారాల పట్టీ కల్వకుంట్ల కవిత తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో రాజకీయాల్లో వచ్చి, జాగృతి సంస్థను స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టి వార్తల్లోకెక్కారు. అంతకుముందు ఆమె అమెరికాలో సాప్ట్‌ వేర్‌ ఉద్యోగిగా పని చేశారు. 2014 లోకసభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైనప్పటికీ 2019 లోకసభ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో ఓడిపోయారు. దీంతో తండ్రి కెసీఆర్‌ ఆమెకు ఎంఎల్సి పదవి ఇచ్చారు. ఢల్లీి లిక్కర్‌ స్కాంలో కవిత ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు. తన కూతురు ను అరెస్ట్‌ కాకుండా గతంలో చక్రం తిప్పిన కెసీఆర్‌ అధికారం కోల్పోయిన తర్వాత అరెస్ట్‌ ను అడ్డుకోలేకపోయారు. బిజెపి ప్రభుత్వాన్ని నిందించడం వంటివి చేయలేదు. కవిత విషయంలోతన అన్న, మాజీ మంత్రి కెటీఆర్‌ వెన్నెంటే ఉన్నప్పటికీ కెసీఆర్‌ నోరు మెదపకపోవడం గమనార్హం.మరో బిఆర్‌ఎస్‌ నేత, మాజీ డిప్యూటి సీఎం కడియం కూతురు కడియం కావ్య రాజకీయాల్లో కొత్తగా పరిచయం అయ్యారు. తండ్రి ఇన్‌ ఫ్లూయెన్స్‌ తో ఆమెకు ఈ ఎన్నికల్లో వరంగల్‌ లోకసభ స్థానం టికెట్‌ ను బిఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చింది. కెసీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ , అవినీతివార్తలు వెలువడటంతో ఇటీవలికాలంలో బిఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ లో చేరికలు ఎక్కువయ్యాయి. తండ్రితో బాటు ఆమె కూడ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కడియం కావ్య ఎంబిబిఎస్‌ పూర్తి చేసి ఉస్మానియా మెడికల్‌ కాలేజి నుంచి పాథాలజీ ఎండీ పూర్తి చేశారు. అయినప్పటికీ కడియం ఫౌండేషన్‌ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం కాకతీయ మెడికల్‌ కాలేజి రెసిడెంట్‌ డాక్టర్‌ గా పని చేస్తున్నారు. కడియం కావ్య తండ్రి వారసత్వంగా రాజకీయాల్లో వచ్చారు బిఆర్‌ఎస్‌ లో అనేకమంది వరంగల్‌ టికెట్‌ కోసం పోటీ పడినప్పటికీ కెసీఆర్‌ కడియం కావ్యకు పెద్ద పీట వేస్తూ వరంగల్‌ లోకసభ నుంచి కావ్య పోటీ చేస్తుందని అనౌన్స్‌ చేశారు. ఈ అనౌన్స్‌ అయిన కొద్దిగంటలకే ఆమె బిఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి తాను బిఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించారు. కావ్య తండ్రి కడియం శ్రీహరి వల్లే తాను బిఆర్‌ఎస్‌ కు రాజీనామా చేసిన మరో మాజీ డిప్యూటిసీఎం తాటికొండ రాజయ్య తన రాజీనామా ఉపసంహరించుకుని తాను వరంగల్‌ స్థానం ఆశిస్తున్నట్లు ప్రకటించారు. రెండు సార్లు బిఆర్‌ఎస్‌ నుంచి రాజ్య సభ సభ్యులుగా ఉన్న కె. కేశవరావ్‌ బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడైన కెసీఆర్‌ కు అత్యంత సన్నిహితుడు. ఈ కారణంగా ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మికి మేయర్‌ అవకాశం ఇచ్చారు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన గద్వాల విజయ లక్ష్మి రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. కేశవరావ్‌ కుమారుడు విప్లవ్‌ కుమార్‌ పై మర్డర్‌ కేసు ఆరోపణలున్నప్పటికీ కెసీఆర్‌ కెకె ఫ్యామిలీకి పూర్తి సహకారం అందించారు. మొదట్నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కెకె తన మాతృ సంస్థలో చేరడానికే బిఆర్‌ఎస్‌ కు కూతురుతో సహా రాజీనామా చేశారు. కెసీఆర్‌ ఉంటున్న ఫామ్‌ హౌజ్‌ కు వెళ్లి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. తన తండ్రి బిఆర్‌ఎస్‌ కు రాజీనామా చేయడం పట్ల కొడుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వయసులో రాజీనామా చేసి కాంగ్రెస్‌ లో చేరడం ఎందుకని ప్రశ్నించారు. కొడుకు వ్యతిరేకిస్తున్నప్పటికీ కేశవరావ్‌ కూతురుతో సహా కాంగ్రెస్‌ వైపు అడుగులు వేశారు. ఒక నాన్నకు కూతుళ్లే బంగారం అని నిరూపించారు ఈ ముగ్గురు రాజకీయ నేతలు.తెలంగాణ రాజకీయాల్లో ఇపుడు తండ్రి, కూతుళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి పుత్రికల కోసం తండ్రులు చేసే ఈ రాజకీయం వర్కవుట్‌ అవుతోందా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *