జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఉత్తమాటేనా
` ప్రస్తావించని ఎమ్మెల్యే, హావిూ ఇవ్వని మంత్రి
` నెల దాటితే ఎన్నికల కోడ్‌
` ప్రతిపక్షాల మేనిఫెస్టోలో కూడా చోటుదక్కని వైనం
పెద్దపల్లి: ఎంతో ఆశగా ఎదురుచూసిన జర్న జర్నలిస్టుల ఇండ్లు, ఇండ్ల స్థలాల ఆశలపై రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి నీళ్ళు చల్లినట్లుగానే కనిపిస్తున్నది. ఇటు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి అటు మంత్రి కేటీఆర్‌ జర్నలిస్టు ఇళ్లపై స్థలాలపై ఎలాంటి హావిూ ఇవ్వకపోవడంపై పలువురు జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులు, సీనియర్‌ పాత్రికేయులు ఆలోచనలో పడిపోయారు. ప్రధానంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొన్ని ఏళ్లుగా జర్నలిస్టులు ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఎక్కని గడపలేదు దిగని గడపలేదు అన్నట్టుగా పలుమార్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డికి వచ్చిన ప్రతి కలెక్టర్‌ లకు చివరికరిగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్‌ ఇక్కడి జర్నలిస్టులకు శుభవార్త చెప్తాడు అనుకుంటే నిరాశ దక్కిందని పలువురు పాత్రికేయులు చర్చించుకోవడం కనిపించింది. ఇందులో కూడా ఒక ప్రధాన అంశం తెరపైకి రావడం విశేషం. ఇప్పటికే కొంతమంది సీనియర్‌ జర్నలిస్టులు జిల్లా అధికారులను మంచిగా చేసుకొని కొంత భూమిని ఆక్రమించారని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. అలాగే జిల్లా కేంద్రంలోని జర్నలిస్టుల మధ్య ఐక్యత లోపించడం పలు సంఘాలు వేరువేరుగా ప్రజాప్రతినిధులను, అధికారులను కలవడం కూడా ఈ విషయంలో ప్రధాన అంశంగా చర్చించు కుంటున్నారు. మరొక విషయం ఏమిటంటే కొంతమంది ప్రజాప్రతినిధు లకు దగ్గరగా ఉండి మిగతా జర్నలిస్టులను చులకన చేసి వారికి ఎలాంటి లబ్దులను అందకుండా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదీ ఏమైనా జర్నలిస్టుల మధ్య ఐక్యత రానన్ని రోజులు ఇలాగే ఉంటుందనేది అక్షర సత్యం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *