భరతజాతి గుండె చప్పుడు మహాత్మా గాంధీ…
సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకొని భారతావని స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి పోరాడిన మహాత్ముడు గాంధీజీ …
మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ల అడుగుజాడల్లో నడుద్దాం…
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యస్థాపనకు కృషి చేస్తున్న సీఎం జగన్…
అన్నమయ్య జిల్లా, రాయచోటి:భరతిజాతి గుండె చప్పుళ్ళు అయిన మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ల అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.సోమవారం మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి ల సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఉన్నగాంధీజీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, డిఆర్ఓ సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు పబ్బిశెట్టి సురేష్ కుమార్ తదితరులుతో కలసి కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.గాంధీజీ విగ్రహానికి శ్రీకాంత్ రెడ్డి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సత్యము, అహింస లు గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలని,సహాయ నిరాకరణ, సత్యా గ్రహము ఆయన ఆయుధాలని, కొళాయికట్టి , చేత కర్ర పట్టి ,నూలు ఒడికి, మురికి వాడలు శుభ్రం చేసి,అన్నీ మతాలు ఒక్కటే నని చాటి చెప్పి రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్య పాలనకు చమరగీతం పాడారన్నారు. ప్రపంచమంతటా గాందీజీ విగ్రహాలున్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి దేశ రెండవ ప్రధానిగా భారతీయుల హృదయాలలో నిలిచిన అమర జీవి అని అన్నారు. అఙాత శత్రువుగా పేరు పొందిన ఆయననే పదవులు వరించాయన్నారు.ఆ మహనీయుల దేశభక్తి,చిత్తశుద్ధి, నిజాయితీ ,సేవా భావాలు అందరికీ ఆదర్శం కావాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు.రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడి నాలుగేళ్లు పూర్తయిందని,ఈ సచివాలయ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ బాలకృష్ణ, మున్సిపల్ కమీషనర్ గంగా ప్రసాద్, జెడ్ పి టి సి మాసన వెంకట రమణ, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, యువజన విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన మోహన్ రెడ్డి,మాజీ కో ఆప్షన్ అలీ నవాజ్,ఆసీఫ్ అలీఖాన్, ఫయాజ్ అహమ్మద్,రౌనక్, గౌస్ ఖాన్, బిసి సెల్ విజయ భాస్కర్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, సుగవాసి శ్యామ్, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బజ్జుబాబు, జానం రవీంద్ర యాదవ్,ఎస్ డి హెచ్ ఆర్ విద్యాసంస్థల అధినేత హరినాధ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఆనంద రెడ్డి, నేలపాటి వెంకటేష్, అమీర్, ముదిరాజ్ యువసే అధ్యక్షుడు విక్కీ దేవేంద్ర,జావీద్, కో ఆప్షన్ హజరత్ ఖాదర్ వలీ, నవాజ్ క్రిష్, కనపర్తి చెన్నారెడ్డి, కలకడ మియా,పొదలపల్లె అశోక్ ,ఆర్యవైశ్య సంఘ నాయకులు కూనా కృష్ణదేవరాయలు, కార్యదర్శి కేపీఎల్ సత్యనారాయణ , సుబ్రహ్మణ్యం, సుధాకర్, బాలాజీ, మనోజ్, రమేష్, కూన విజయ్ కుమార్ ,రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.