అన్నమయ్య జిల్లా:టిడిపి,ఎన్ డి ఎ కూటమిలో భాగంగా రాజంపేట బిజెపి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని జిల్లా వాసులు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి డా.. పాలగిరి శ్రీనివాస కుమార్ రాజు కోరారు.ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తిని ఎంపిగా గెలిపిస్తే జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో రాబోవు రోజుల్లో జరగనున్న ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు.వైసిపి పాలనలో రాష్ట్ర ప్రజలు అన్ని విధాల నష్టపోయారన్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నా , రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్న అది ఎన్ డి ఎ కూటమితోనే సాధ్యపడుతుందని తెలిపారు.పార్టీ జెండాలు వేరైనా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, భావి తరాల భవిష్యత్ వారి లక్ష్యం అని గుర్తుచేశారు. పేదరికం లేని దేశాన్ని నిర్మించాలనే ఎన్డీఏ మన రాష్ట్రానికి చాలా అవసరమని, కేంద్రంలో ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఓటు వేసే గెలిపించి అటు దేశ అభివృద్ధిలో ఇటు రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా వాసులకు శ్రీనివాస్ కుమార్ రాజు విజ్ఞప్తి చేశారు.