వీరబల్లి: బహుజన రాజ్య స్థాపనకు ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రకులాల్లోని పేదలంతా ఏకం కావాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా రాజ్యాధికారం సాధించిన నాడే బహుజనుల బతుకులు మారతాయని జై బీమ్ రావ్ భారత్ పార్టీ రాజంపేట అసెంబ్లీ అబ్యర్థి సురేంద్రారెడ్డి పిలుపునిచ్చారు.80 శాతం ఉన్న బహుజనులు ఓట్లతో 20 శాతం ఉన్న వాళ్ళు పాలకులుగా మారుతున్న విషియాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.రాష్ట్రంలోని బహుజనుల్లో మార్పు కోసం జై బీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ కృషి ఎనలేనిది అని తెలిపారు.అన్ని పార్టీలు దళితులను ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారు తప్ప దళిత వర్గ సంక్షేమానికి చేసిందేమి లేదన్నారు. రాజంపేట నియోజకవర్గంలో పేదల కోసం సేకరించిన అసైన్డ్ భూముల కూడ అగ్ర కులాలకే దక్కాయన్నారు.గత ఐదేళ్లుగా నియోజకవర్గంలోని వీరబల్లి, సుండుపల్లి మండలాల్లో మామిడి రైతులు పంట రాక విలవిలలాడుతుంటే నష్ట పరిహారం ఇచ్చి ఆదుకున్న నాధుడే లేరన్నారు.రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కార ద్యేయంగా లక్ష్యం పెట్టుకుని మీ ముందుకు వస్తున్నానని ఒక్క అవకాశం కల్పించి మీ విలువైన ఓటును “కోటు”గుర్తుపై వేసి బలపర్చాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఓటు వినియోగించుకున్నపుడే మనకు ప్రశ్నించే జవాబుతరం వస్తుందన్నారు.నియోజకవర్గంలోని బహుజనులంతా ఏకమై అగ్రకులాలకు చెందిన అవినీతి నాయకత్వాన్ని తరిమికొట్టడానికి సమయం అసన్నమైనదని దానికి పరిష్కారమే మీ విలువైన ఓటు అనే విషయాన్ని గ్రహించాలని తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *